English | Telugu
రాజనందిని హత్య వెనక జెండే వున్నాడా?
Updated : Jan 28, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మొత్తం ఎనిమిది భాషల్లో రీమేక్ అవుతున్న ఈ సీరియల్ కు మరాఠీ సీరియల్ ఆధారం. పూర్వ జన్మ ప్రతీకారం కోసం మనో జన్మ ఎత్తడం... అది తానే అనే గుర్తు చేసి తన హత్యకు కారణం ఎవరో తెలుకోమని చెప్పడం వంటి ఆసక్తికర కథ, కథనాలతో ఈ సీరియల్ వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్ కె ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, జ్యోతిరెడ్డి, ఉమ, మానస మనోహర్, అనుష సంతోష్ నటిస్తున్నారు.
20 ఏళ్లుగా రాజనందని పేరు మీద అర్చన చేయిస్తున్న రాగ సుధని వెతుక్కుంటూ ఓ పురాతన గుడికి అను, ఆర్య వర్థన్ తో కలిసి వస్తుంది. అక్కడ రాగసుధ ఫొటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని ఆరాతీయడం మొదలుపెడుతుంది. ఇంతలో తన చేతుల్లోని రాగసుధ ఫొటో జారి గాలికి కొట్టుకుంటూ పూజారి చేతికి చేరుతుంది. ఫొటో చూసిన పూజారి నిర్ఘాంతపోయి ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నారా? అంటాడు. మీకు తెలుసా అని అడుగుతుంది.
Also Read:కన్నుకొట్టిన రష్మీ..సుధీర్ గడ్డివాము కథేంటీ?
రాగసుధ ఎన్నేళ్లుగా రాజనందిని కోసం పూజాలు చేస్తుందో వివరించే సరికి తనే నా చెల్లెలు అని అను భావిస్తుంది. తను ఇదే గుడికి ఈ రోజు వస్తుందని పూజారి చెప్పడంతో ఆర్యవర్థన్ తో కలిసి రాగసుధ వచ్చేంత వరకు ఇక్కడే వుండాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఈ విషయం ఆర్యవర్థన్ కి తెలియదు. అను తెలియనివ్వదు. ఈ క్రమంలో ఆర్యని ఆపాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ తాను వెళ్లిపోదాంఅంటుంటాడు.
Also Read:పెళ్లికి సిద్ధమైన యష్ - వేదలకు బిగ్ షాక్
కట్ చేస్తే ఆర్య వర్ధన్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాగసుధ.. జెండే పై హత్యా ప్రయత్నం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో మీరా రావడంతో తన ప్రయత్నం విరమించుకుని ఆఫీస్ లోనే ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది. ఈ విషయం మీరా కనిపెట్టి తనని వెతకడం మొదలుపెడుతుంది.. ఈ క్రమంలో ఏం జరిగింది? .. రాజనందని హత్యకు ఆర్య వర్ధన్ అంగరక్షకుడు జెండేకు వున్న సంబంధం ఏంటీ? .. అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.