English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి చదువుకోలేదని ప్రేమ, నర్మద నిరూపిస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -337 లో.... రామరాజుకి కస్టమర్ కేర్ అతను ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే రామరాజుకి అర్థం కాక శ్రీవల్లికి మాట్లాడమని ఇస్తాడు. శ్రీవల్లి ఏదో మాట్లాడినట్లు ఒకే యా అంటూ కవర్ చేస్తుంది. ఏంటి అమ్మ వల్లి.. నువ్వు M.A ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ అదరగొడతావని అనుకుంటే అలా మాట్లాడుతున్నావని రామరాజు అంటాడు. అదంతా చూస్తున్న ప్రేమ, నర్మద ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వస్తారు.

శ్రీవల్లి దగ్గర నుండి ప్రేమ ఫోన్ లాక్కొని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. నువ్వు ప్రేమ లాగా గడగడా ఎందుకు మాట్లాడలేదని రామరాజు అడుగుతాడు.. అంటే మావయ్య నాకు అది అర్థం కాలేదు.. లేదంటే నేను మంచిగా మాట్లాడేదాన్ని అని శ్రీవల్లి అనగానే అయితే ఇప్పుడు ప్రేమతో ఇంగ్లీష్ లో మాట్లాడమని నర్మద అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే వేదవతి వచ్చి రామరాజుని భోజనానికి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు సాగర్ డల్ గా ఉంటే చందు, ధీరజ్ వచ్చి ఏమైందని అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పడు. ఆ తర్వాత ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని బుక్ తీసుకొని వచ్చి రాత్రంతా ప్రాక్టీస్ చేస్తుంది శ్రీవల్లి.

మరుసటిరోజు శ్రీవల్లి నిద్ర లేవగానే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావని వెయిట్ చేస్తున్నామని ప్రేమ, నర్మద, తిరుపతి, అమూల్య రూమ్ ముందు ఉంటారు. దాంతో శ్రీవల్లి జానీ జానీ ఎస్ పాప అని రైమ్ చదివి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీవల్లికి బాగా ఇంగ్లీష్ వచ్చని తిరుపతి అనుకుంటాడు. శ్రీవల్లి M.A ఇంగ్లీష్ కూడా చదవలేదన్నమాట.. తన సంగతి చెప్తానని ప్రేమ, నర్మద అనుకుంటారు. మరొకవైపు అమూల్యని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. పైనుండి అమూల్యని పిలుస్తాడు విశ్వ. అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.