సమంతే విడాకులు కోరింది.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
on Jan 27, 2022

టాలీవుడ్ బెస్ట్ బెస్ట్ కపుల్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత జంట ఊహించని విధంగా ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి కారణమేంటని దానిపై స్పష్టత లేదు. పెళ్లి తర్వాత సమంత ఎంచుకుంటున్న పాత్రలు నచ్చక, అలాగే తల్లి కావడానికి సమంత అంగీకరించకపోవడం వంటి కారణాలతో చైతన్య విడాకులు ఇచ్చాడని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వీరి విడాకులపై స్పందించిన నాగార్జున.. సమంతే చైతన్యను విడాకులు కోరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య, సమంత విడాకుల అంశంపై నాగార్జున స్పందించారు. చైతూ నుంచి సమంతే మొదట విడాకులు కోరిందని, చైతూ కేవలం ఆమె నిర్ణయాన్ని గౌరవించి విడాకులకు ఓకే చెప్పాడని తెలిపారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య విడిపోయేంతటి పెద్ద సమస్యేంటో ఇప్పటికీ తనకు తెలియదని అన్నారు. గత ఏడాది నూతన సంవత్సర వేడుకలనూ కలిసే జరుపుకొన్నారు. ఆ తర్వాతే వారి మధ్య ఏదో సమస్య వచ్చిందని, అది ఏమిటనేది తనకు కూడా తెలియదని అన్నారు. విడాకుల విషయం తనతో చెప్పడానికి చైతూ ఎంతో ఆవేదన చెందాడని తెలిపారు. ఆ విషయాన్ని తానెలా తీసుకుంటానోనని కలత చెందాడని.. కుటుంబ పరువు, మర్యాద ఏమవుతాయోనని మదనపడ్డాడని నాగార్జున చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



