English | Telugu
శృతి కుట్ర బయట పెట్టిన అప్పు.. ఏం జరగబోతోంది?
Updated : Jan 27, 2022
జీ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `రాధమ్మ కూతురు`. గోకుల్ , దీప్తి మన్నె, మేఘన రామి, సాండ్రా జై చంద్ర, మహి, భార్గవ్, శ్రీలత కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ శుక్రవారం సరికొత్త మలుపులతో సరికొత్త ట్విస్ట్ లకు వేదిక కాబోతోంది. ఈ శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటీ? .. శృతి కుట్ర బయటపడటంతో అక్షర ఎలా రియాక్ట్ అయిందన్నది ఈ రోజు తెలియబోతోంది.
ఏడేళ్లుగా తనకు దూరంగా వుంటున్న అక్షరని తన దగ్గరికి తీసుకురావాలని అరవింద్ పెళ్లి నాటకం ఆడుతుంటాడు. అయితే తను పెళ్లి చేసుకున్నానని తీసుకొచ్చిన అమ్మాయిని తన కుట్రలో భాగం చేస్తుంది శృతి. తనని బ్లాక్ మెయిల్ చేస్తూ ఎప్పటికప్పుడు అరవింద్, బుజ్జమ్మ ఏం చేయబోతున్నారు? అక్షర వారిని కలవడానికి వస్తుందా? .. వస్తే ఎలా దూరం చేయాలని శృతి ప్లాన్ చేస్తూ వుంటుంది. కట్ చేస్తే ఇదే సమయంలో అరవింద్ తో పెళ్లి నాటకం ఆడుతున్న యువతిని వెతుక్కుంటూ ఆమె బావ బయలుదేరతాడు. విషయం తెలిసి అరవింద్ ఇంటికి పోలీసులతో వచ్చినా శృతి అడ్డతగిలి కనుక్కోకుండా చేస్తుంది.
Also Read:విజయ్-పూరి కాంబోలో మరో మూవీ.. హీరోయిన్ గా జాన్వీ కపూర్!
ఈ క్రమంలో అక్షర - అరవింద్ మధ్య అగాధాన్ని సృష్టించింది శృతి అని అక్షర చెల్లెలు అప్పుకు తెలిసిపోతుంది. దీంతో అపరకాళికలా మారిన అప్పు .. శృతిని చంపేస్తానంటూ వెంట పడుతుంది. ఓ అమ్మావారి ఆలయంలోకి శృతిని తరుముకుంటూ వస్తుంది. అక్కడే వున్న త్రీశూలం తీసుకుని శృతిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఎంటరైన అక్షర .. అప్పుని ఆపుతుంది. అయితే అసలు విషయం అప్పు చెప్పడంతో అక్షర కూడా అగ్రహానికి లోనై శృతిని హత్య చేస్తానని, అసలు నిజం చెప్పమంటుంది.. వెంటనే శృతిని తన అత్త బుజ్జమ్మ వద్దకు తీసుకెళుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? బుజ్జమ్మ అసలు నిజం తెలుసుకుందా? శృతి పరిస్థితి ఏంటీ? అన్నది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్పిందే.