English | Telugu
తల్లి కూతుళ్ళని కలపడానికి వాళ్ళిద్దరి ప్రయత్నం.. తన ప్రేమ బయటపెడుతుందా!
Updated : Jul 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -784 లో... తల్లి కూతుళ్లని ఒకటి చేయాలని రాజ్, కావ్య కలిసి రేవతి జగదీశ్ లని పుట్టినరోజుకి రప్పిస్తారు. కానీ రేవతిని అపర్ణ చూడగానే తన కోపాన్ని మొత్తం బయటపెట్టింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటూ తిడుతుంది. అత్తయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని అలా తిట్టడం కరెక్ట్ కాదు.. ఆమె మీ కూతురని నాకు ఇప్పుడే తెలిసిందని కావ్య అంటుంది. నీకు ఇప్పుడే తెలిసింది కానీ రేవతికి అయితే తెలుసు కదా అని రుద్రాణి ఇంకా గొడవ పెద్దది అయ్యేలా చూస్తుంది.
ఇదే మంచి సందర్బం అనుకొని క్షమించండి అత్తయ్య అని అపర్ణని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఈ ఇంటికి కోడలు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను కానీ ఆ మనిషిని ఈ జన్మలో క్షమించనని అపర్ణ తెగేసి చెప్తుంది. దాంతో రేవతి జగదీష్ అక్కడ నుండి బాధపడుతూ వెళ్లిపోతారు.
ఆ తర్వాత రేవతి, అపర్ణ కలిసి ఉన్న ఫోటోని చూస్తూ అపర్ణ బాధపడుతుంటే సుభాష్ వస్తాడు. ఇప్పటికైనా నీకు రేవతిపై కోపం తగ్గలేదా అని అడుగుతాడు. అది కోపం కాదు.. బాధ.. ఎంత ప్రేమగా చూసుకున్నాం ఎంత మోసం చేసిందని అపర్ణ బాధపడుతుంది. మరొకవైపు ఇన్ని రోజులు అపర్ణకి రేవతిని దగ్గర చెయ్యాలని చాలా ట్రై చేశాను. ఇప్పుడు మీరు ఇలా చేసి అపర్ణ కోపం మొత్తం బయటకి వచ్చేలా చేశారు ఇంకా దూరం పెరిగిందని రాజ్, కావ్యలపై ఇందిరాదేవి కోప్పడుతుంది.
తరువాయి భాగంలో రాజ్, కావ్య కలిసి రేవతి అపర్ణ ఇద్దరు ఎదురుపడేలా చెయ్యాలనుకుంటారు. రేవతిని గుడికి తీసుకొని రావాలనుకుంటాడు రాజ్. అపర్ణని కావ్య గుడికి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.