English | Telugu
Brahmamudi : సాక్ష్యాలు లేకుండా చేసిన యామిని.. పెళ్ళికి సిద్ధమైన రాజ్!
Updated : Jun 22, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-754 లో... యామిని, రాజ్ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. ఏంటి వదిన అందరు సైలెంట్ గా ఉన్నారు. రాజ్ వేరొక పెళ్లి చేసుకుంటున్నాడని అపర్ణ వాళ్ళతో రుద్రాణి అంటుంది. కావ్య నువ్వు ఏంటి సైలెంట్ గా ఉన్నావని కావ్యని రుద్రాణి అడుగుతుంది. నేను ఆపను కానీ ఈ పెళ్లి జరగదని కావ్య అంటుంది.
మరొకవైపు ఆ రౌడీని తీసుకొని పోలీసులు ఇంకా రావడం లేదని అప్పు, కళ్యాణ్ టెన్షన్ పడతారు. ఆ తర్వాత యామిని మెడలో రాజ్ తాళి కట్టే టైమ్ కి రుద్రాణి ఆపండి అంటుంది. ఎందుకు ఆపావని వైదేహీ అంటుంది. అక్కడ పోలీసులు వచ్చారని అంటుంది. కానిస్టేబుల్ వచ్చి యామిని గారిని అరెస్ట్ చేయాలని అంటాడు. ఎందుకని యామిని అడుగతుంది. మీరు కావ్య గారిని చంపాలని ట్రై చేశారు. దానికి సాక్ష్యం ఈ రౌడీ అని కానిస్టేబుల్ అంటాడు. అప్పుడు ఆ రౌడీ.. ఈ యామిని ఎవరని యామినికి సపోర్ట్ గా మాట్లాడతాడు. దాంతో అప్పు వాళ్ళందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత అప్పు జరిగిందంతా చెప్తుంది. మా అక్క మీతో క్లోజ్ గా ఉంటుందని పగతో తనని చంపాలని ట్రై చేసింది.. ఈ యామిని రౌడీకి డబ్బు ఇస్తుంటే నేను వీడియో తీసానని అప్పు తన ఫోన్ లో చూసేసరికి వీడియో ఉండదు. రాత్రి అప్పు పడుకున్నాక రాహుల్ వెళ్లి తన ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాడు.
అప్పు వీడియో లేదని అనగానే చూసావా బావ వీళ్ళు కావాలనే నన్ను ఇలా చేస్తున్నారని యామిని యాక్టింగ్ చేస్తుంది. యామిని ఇదంతా చేసింది అనడానికి సాక్ష్యాలు చూపించలేపోతున్నావ్ అప్పు.. ఇక ఎలా నమ్మవంటావని రాజ్ అంటాడు.
తరువాయి భాగంలో యామిని తప్పు చెయ్యలేదని మీరు నమ్ముతున్నారా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నమ్ముతున్నానని రాజ్ అనగానే అయితే పెళ్లి చేసుకోండి అని కావ్య అంటుంది. యామిని మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.