English | Telugu
బిగ్ బాస్ సీజన్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు?
Updated : Sep 13, 2024
బిగ్ బాస్ హౌస్ లో అసలేం జరుగుతుంది. కంటెస్టెంట్స్ ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్ లేదు. హౌస్ లో ది బెస్ట్ , వీరికి మనం సపోర్ట్ చేద్దాం అని అనిపించే కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా.. అంటే ఆలోచించాల్సిందే.
ఫుడ్ కోసం కంటెస్టెంట్స్ కి టాస్క్ లు, కామెడీ లేదు..ఇవన్నీ చూస్తుంటే సీజన్-6 గుర్తొస్తుంది. ఈ సీజన్ లో హౌస్ లో జెన్యున్ గా ఉండి, టాస్క్ లలో బాగా ఆడి, రూల్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిర్రాక్ సీత, అభినయ్ నవీన్ ల ఏవీ చూసి.. ఈ సీజన్ లో ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ పక్కా అనిపించింది కానీ హౌస్ లోకి వెళ్ళాక కథ మారిపోయింది. ఎంతలా అంటే బేబక్క ఫైర్ ని పప్పు ఉడకలేదంటూ సోనియాతో సహా హౌస్ మేట్స్ అంతా నామినేట్ చేయడంతో తను సైలెంట్ అయ్యింది. ఇక శేఖర్ బాషా తన నాన్ సింక్ జోకులతో అప్పుడప్పుడు నవ్వించే వాడు.. కానీ నాగమణికంఠ అలా జోకులు వేస్తే నాకు చిరాకు అని చెప్పడంతో అతను కామెడీ చేయడమే మర్చిపోయినట్టున్నాడు. ఇక ఆదిత్య ఓం.. ఆయితే ఇంటి పెద్దలా ఆలోచించలేకపోతున్నాడు. టాస్క్ లలో పర్ఫామెన్స్ లేదు.. ఏదైనా గొడవ జరిగితే అక్కడ కనపడడు.. అసలు హౌస్ లో ఉన్నాడా అంటే ఏదో హౌస్ అంతా క్లీన్ చేయడానికి, హౌస్ లో పనులు చేసేవారికి సహాయం చేయడానికి వచ్చినట్టుంది.
ఇక కిర్రాక్ సీత జెన్యున్ గా ఉంటూ తన టర్న్ వస్తే ఫైర్ అవుతుంది. కానీ టాస్క్ లలో తను ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతుంది. విష్ణుప్రియ ఇన్నోసెంట్ గా ఉండటంతో మిగతావారి చేత మాటలనిపించుకుంటుంది. ఇక సోనియా మొదట కన్నడ బ్యాచ్ అందరిని శత్రువులుగా చూసి వారందరు తన బాల్య మిత్రులుగా భావిస్తోంది. రతిక మాదిరి హౌస్ లో పర్ఫామెన్స్ ఇస్తోంది. ఇక యష్మీని చూస్తే శోభాశెట్టిలా అనిపిస్తోంది. ఎంత సైకోయిజం ఉండాలో అంతా ఉంది. ఇక పృథ్వీ అనగానే అందరికి గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి.. లేజీ ఫెలో, బద్ధకం, పని చేయడు, పనికి రాడు, ఆటలో అరటిపండు, తిండి దండగ.. ఈ కోవకి చెందినవారు హౌస్ లో ఎవరైన ఉన్నారా అంటే అది పృథ్వీనే అని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరు చెప్తారు. ఇక నబీల్ టాస్క్ లో కండబలం చూపిస్తున్నాడు కానీ బుద్ధి బలం చూపించలేక గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇక సింపథీ స్టార్ నాగ మణికంఠని చూస్తే... ఎందుకు ఉన్నాడో అర్థం కానీ పరిస్థితి. అభయ్ నవీన్ కాస్తో కూస్తో కామెడీ జనరేట్ చేయాలని చూస్తున్నాడు కానీ ఫుల్ లెంత్ ఇవ్వలేకపోతున్నాడు. ప్రేరణ , నిఖిల్, యష్మీ, సోనియా వీళ్ళంతా కలిసి ఓ గ్రూప్ గా ఉంటున్నారు. వీళ్లు గత సీజన్ సీరియల్ బ్యాచ్ ని గుర్తుచేస్తున్నారు. కన్నింగ్, సైకోయిజం, కమాండింగ్, ఇవన్నీ వారి మాటలతోనే చూపిస్తున్నారు. హౌస్ లో మొత్తంగా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉండగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో? ఎందుకో చెప్తూ ఓ కామెంట్ చేయండి.