English | Telugu
గ్రాంఢ్ లాంచ్ 2.0 లోని కంటెస్టెంట్స్ వీళ్ళే!
Updated : Oct 4, 2023
బిగ్ బాస్ ఎన్నడు లేనీ విధంగా ఉల్టా పుల్టాతో సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది. హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా, ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌజ్ లో ఇప్పుడు పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే వీరితో షో పూర్తి స్థాయిలో నడవదని చెప్పాలి. దాంతో కిత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం 2.0 గా బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకురావడానికి బిబి యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటికే నాలుగ వారాలు ఫుల్ జోష్ తో రన్ అయిన మాట వాస్తవం. గత నాలుగు వారాల నుండి ఫిమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా బిగ్ బాస్ 2.0 మినీ లాంచ్ లో ఎక్కువ మంది ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గల నుండి సమాచారం. ఇప్పటికే దీనికోసం కొంతమందితో సంప్రదించి వాళ్ళతో అగ్రిమెంట్ లు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కూడా టీవీ రంగం నుండి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. సీరియల్ నటి అంజలి పవన్, పూజా మూర్తి, నయని పావని, అంబటి అర్జున్, బోలె షావలి ఇప్పటికే కన్ ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హౌజ్ లో సీరియల్ బ్యాచ్ , శివాజీల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. దాంతో కంటెస్టెంట్స్ నువ్వా - నేనా అంటూ గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పటికే శివాజీ టాప్-5 కంటెస్టెంట్ గా తనకి ప్రేక్షకులు వేసే ఓటింగ్ తో స్పష్టంగా తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే ఉల్టా పుల్డాతో రసవత్తరంగా కొనసాగుతుండగా, ఇక బయట నుండి వెళ్తున్న ఈ హౌస్ మేట్స్ ప్రేక్షకుల అంచనాలని తెలుసుకున్నారు. బిగ్ బాస్ రోజుకొక కొత్త ట్విస్ట్ తో కంటెస్టెంట్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. మొన్నటి వరకు పవరస్త్ర కోసం టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ టాస్క్ అంటు హౌజ్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. ఇది ఇలా కొనసాగుతుండగా, కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఈ షో ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది. మరి వీళ్ళు సీరియల్ బ్యాచ్ లో కలుస్తారా? ఎవరికి వారే ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతారా లేదా చూడాలి మరి.