English | Telugu

సీరియల్ బ్యాచ్ కి మంట పెట్టిన బిగ్ బాస్!


బిగ్ బాస్ ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ‌ఏ సీజన్లోను ఇలా గ్రూప్ గా గేమ్స్ ఆడింది లేదు. ప్రియాంక జైన్ గ్రూప్ కి లీడర్. ఆమె ఏం చెప్తే అదే వేదం అన్నట్టుగా అమర్ దీప్, శోభా శెట్టి చేస్తుండగా, ఆట సందీప్ తన ఆటని మర్చిపోయాడు. అమర్ దీప్, శోభా శెట్టి , ప్రియాంక జైన్ కోసం ఆడుతున్నాడు.

ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్- ఆట సందీప్, శోభా శెట్టి- ఫ్రియాంకజైన్ లు ఆడిన తీరు మొత్తంగా తప్పుగా ఆడారు. టీత్ తీసుకొచ్చి లిప్స్ లో పెట్టాలని బిగ్ బాస్ చెప్తే శోభా శెట్టి మాత్రం అవసరం లేని టీత్ ఒకటి తనకి దొరికితే దానిని తన ఇన్నర్ వేర్ లో దాచుకొని అది తన స్ట్రాటజీ అంటుంది. ఇక ఆట సందీప్ తనకి ఆ నెంబర్ అవసరమని ఎంత అడిగినా శోభా శెట్టి ఇవ్వకుండా.. అది తన స్ట్రాటజీ అని అంది.

ఆ తర్వాత శోభా శెట్టికి కావలసిన నెంబర్ గల టీత్ ఇస్తే, తన ఇన్నర్ వేర్ లో దాచుకున్న టీత్ ని ఆట సందీప్ కి ఇచ్చింది. ఇలా చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆట సందీప్ పూర్తిగా టీత్స్ ని అమర్చకముందే అమర్ చేత బెల్ ని కొట్టించాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి టీత్ తీసుకొచ్చి బెల్ కొట్టారు. అయితే ఇలా వీళ్లు నలుగురు కలిసి మిస్టేక్స్ చేశారు.‌ ఇలా సీరియల్ బ్యాచ్ మిస్టేక్స్ ఎన్ని చేసినా కూడా ఫస్ట్ రాలేకపోయారు. పల్లవి ప్రశాంత్-శివాజీలు మొదట టాస్క్ ఫినిష్ చేసి బెల్ కొట్టారు.


ఇక వీళ్ళంతా కలిసి పల్లవి ప్రశాంత్- శివాజీలకి ఫస్ట్ ఇవ్వొద్దని, వారి లిప్ లో టీత్ సరిగ్గా లేదని, అది కౌంట్ లోకి రాదని వాదించారు. ఇక యావర్-శోభా శెట్టి సంచాలకులుగా ఉండటంతో.. యావర్ రూల్ బుక్ తీసుకొచ్చి స్పష్టంగా వివరించినా ఎవరికి వారే తమే ఫస్ట్ అంటు అమర్ దీప్-ఆట‌ సందీప్ వాదించాడు. అయితే శోభా శెట్టి సంచాలకురాలిగా ఉండటంతో యావర్ ని మానిపూలేట్ చేసింది. విన్నింగ్ ఆర్డర్ లో మొదట పల్లవి ప్రశాంత్-శివాజీల పేర్లు చెప్తారు. అయితే వాళ్ళది టీత్ సరిగ్గా లేదని, వాళ్ళ తర్వాత మేం బెల్ కొట్టామంటూ అమర్ దీప్ వాదించాడు.

అమర్ దీప్ తనది కరెక్ట్ అని వాదించుకునే టైమ్ లో శుభశ్రీతో అసభ్యంగా మాట్లాడాడు. ఒక టీత్ ని తీసుకొచ్చి అక్కడ పడేసిందని శుభశ్రీని తిట్టాడు అమర్ దీప్. అది కరెక్ట్ కాదండి అమర్ దీప్ గారు అంటూ శుభశ్రీ మాట్లాడిన వినకుండా.. ఆ బొక్కలే అంటు అసభ్యంగా మాట్లాడాడు అమర్‌ దీప్. లైవ్ లో చాలా సార్లు అన్నాడు అమర్ దీప్. అయితే బిగ్ బాస్ కావాలనే అతనికి నెగెటివ్ గా ఉన్నవన్నీ తీసేస్తున్నాడనేది లైవ్ చూసేవాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది.

అయితే ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఇలానేనా మాట్లాడేదంటూ అమర్ దీప్ పై ఇప్పటికే విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇక పల్లవి ప్రశాంత్- శివాజీలు ఫస్ట్ రాకూడదని అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, ఆట సందీప్ అందరు కలసి మళ్ళీ గ్రూప్ గా ఆర్గుమెంట్ చేసారు. అంతకముందు వారం చికెన్ తినే టాస్క్ లో మొత్తం తిన్నానని అనుకొని గౌతమ్ బెల్ కొట్డేశాడు. మళ్ళీ వచ్చి చికెన్ కొంచెం మిగిలిందని ఆట సందీప్ చెప్తే, గౌతమ్ ఆ మిగిలింది తింటే కౌంట్ కాదని చెప్పిన సంఛాలక్ ఆట సందీప్. . నిన్న జరిగిన టాస్క్ లో పూర్తిగా టీత్ తీసుకొచ్చి లిప్ లో అమర్చకముందే వెళ్ళి బెల్ కొట్టేశాడు. ఆ తర్వాత టీత్ దొరికిందని మళ్ళీ తీసుకుని వచ్చి లిప్ లో పెట్టి మళ్ళీ బెల్ కొట్టాడు ఆట సందీప్. ఇదేలా కరెక్ట్ గేమ్ అవుతుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.