English | Telugu

Bigg Boss 9 Telugu : ప్రతీ టాస్క్ లో తనూజ చిరాకు.. దివ్యని టార్గెట్ చేస్తూందిగా!


బిగ్ బాస్ సీజన్-9 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక హౌస్ లోని వారంతా టాస్క్ లపై సీరియస్ గా ఉంటున్నారు. అయితే తనూజ మాత్రం దివ్యని టార్గెట్ చేస్తూ.. చిరాకు చిరాకుగా ఉంటూ తనకి వెన్నుపోటు పొడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో తనూజ, భరణి, దివ్యల మధ్య జరిగిన ఓ గొడవ హైలైట్ గా నిలిచింది.

హౌస్ లో ఏ గొడవ జరిగిన ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనూజ రీజన్ అవుతుంది. ఎందుకంటే
ప్రతీపనికి మాలిన దానికే గొడవే. ఓవర్ ఎమోషన్స్. ప్రతిదాంట్లోనూ నేనున్నానంటూ దూరిపోతుంది. తాను గెలిస్తే మంచిదే.. తనకి అందరూ సపోర్ట్ చేస్తే అంతా మంచి వాళ్లే. కానీ ఆమెకి వ్యతిరేకంగా చిన్నది జరిగినా తట్టుకోలేకపోతుంది. ప్రతి ఆటలోనూ తనే గెలివాలంటే ఎట్టా. పైగా సంచాలక్‌గా బిగ్ బాస్ ఎవర్ని పెట్టాలో కూడా ఈమే ఆర్డర్లు వేస్తుంది. సీజన్ మొత్తం సంచాలక్‌గా ఒక్కరికే ఇచ్చేయండి బిగ్ బాస్ అని దివ్యపై పడి తనూజ ఏడుస్తుంది‌. దాంతో రూల్స్ నీకొక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు.. ఊరికే లొడలొడా మాట్లాడకని తనూజతో భరణి అన్నాడు.

అసలు విషయాన్ని పక్కనపెట్టేసి.. వాగుడు, గీగుడు అని మాట్లాడొద్దు. పిచ్చి మాటలు అనొద్దంటూ తనూజ ఫుల్ ఫైర్ అయింది. నువ్వు ఆడి గెలవలేక.. సంచాలక్‌పై పడి ఏడుస్తావ్ ఏంటి.. సీజన్ మొత్తం సంచాలక్‌గా ఒక్కర్నే పెట్టండి అనే మాటలు ఎందుకని దివ్య అడిగింది. బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి సంచాలక్‌గా వేరే వాళ్లనంట పెట్టండి.. నేను చూడలేకపోతున్నానంటా అంటూ దివ్య అంది. ఒక బ్రాండ్ అండ్ స్పాన్సర్ టాస్క్ కి కూడా దివ్యతో తనూజ గొడవేసుకుంది. తనకు పెద్ద లాజిక్ లు ప్రాక్టికల్స్ అవసరం లేదు.. దొరికామా ఫసక్.. అన్నట్టుగా దివ్యకి తనూజ వెన్నుపోటు పొడుస్తుంది.