English | Telugu
Bigg Boss 9 Telugu: సంజనకి నాగార్జున వార్నింగ్.. రీతూ ఎమోషనల్!
Updated : Nov 30, 2025
నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చీ రాగానే కెప్టెన్ కళ్యాణ్ పడాలకి సెల్యూట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఈ సీజన్-9 లో ఎక్కువ సార్లు కెప్టెన్ అయినందుకు ఇమ్మాన్యుయల్ కి అభినందనలు తెలిపాడు. ఇక హౌస్ లో జరిగిన గొడవల్లో నిన్ను డిస్టబ్ చేసిందింటనని ఇమ్మాన్యుయల్ ని నాగార్జున అడుగగా.. రీతుని సంజన అన్న విషయం చెప్తాడు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు సర్.. అది కరెక్ట్ కాదనే నేను తనను అపాను కానీ సంజన దానికి ఒప్పుకోలేదు.
వాళ్లందరికి అనిపించనిది నీకే ఎందుకు అనిపించింది. నామినేషన్స్‌లో పర్సనల్ ఎజెండాలో పర్సనల్ ఎటాక్ చేశావ్.. వాళ్ల రిలేషన్‌ని అపార్థం చేసుకున్నావ్. రీతూ, డీమాన్ల క్యారెక్టర్ల గురించి తప్పుగా అర్థం చేసుకున్నావ్.. పర్సనల్ ఎటాక్ చేసావ్.. ఇది కరెక్ట్ కాదంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు నాగ్ మామ.ఇక ఇదే విషయం రీతూని అడుగగా.. హౌస్ లో వంద కెమెరాలు ఉన్నాయి తెలుస్తుంది కదా అని రీతూ అంది. ఇక హౌస్ లోని వాళ్ళంతా సంజనదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు. ఇక అందరి అభిప్రాయం విని నాగార్జున ఓ నిర్ణయానికి వచ్చాడు.
నీకు కంఫర్ట్‌గా లేకపోతే.. గేట్లు ఓపెన్ చేస్తా వెళ్లిపోమని నాగార్జున అనగానే హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ ఆర్మనీనీ పాడు చేశావ్ కాబట్టి బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయండి సంజన వెళ్ళు అని అనగానే మొదటగా సంజన రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత నాదేం తప్పు లేదు సర్.. నాకు అన్ కంఫర్ట్ గా ఉందని చెప్పాను.
దానికే హౌస్ లో నుండి వెళ్లాలా..అయితే వెళ్తా అని సంజన అనగానే.. నీ కోసం సాక్రిఫైజ్ చేసింది ఇమ్మాన్యుయల్, రీతూ, భరణి, తనూజ.. ఈ నలుగురు ఏం చెప్తే అదే ఫైనల్ అని మెలిక పెట్టాడు నాగార్జున. దాంతో వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటారు. రీతూకి, ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి సంజన సారీ చెప్తే సరిపోతుందని అందరు అనుకుంటారు. దాంతో తనకి చెప్పగా తను ఒప్పుకోదు. వెళ్ళిపోతానని సంజన అనగానే తనని కన్విన్స్ చేస్తాడు నాగార్జున. ఇక ఫైనల్ గా సంజన సారీ చెప్పి ఆ గొడవకి శుభం పలికింది.