English | Telugu

jayam serial: రుద్ర, గంగల రిసెప్షన్ లో పోలీసులు.. ఇదంతా చేసింది వీరూనేనా!


జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -128 లో.....గంగకి చీర కట్టి రుద్ర తీసుకొని వస్తాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రుద్ర, గంగ దంపతులు పెద్దసారు శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పైడిరాజు, లక్ష్మి దగ్గరికి ఇద్దరు దంపతులు ఆశీర్వాదం తీసుకుంటారు. లక్ష్మీ వాళ్ళకి బట్టలు తీసుకొని వస్తుంది. అవి వాళ్ళ స్థాయికి తగవని ఇవ్వకుండా ఆగిపోతుంది. మీరేదో తీసుకొని వచ్చారు.. ఇవ్వండీ అని రుద్ర అంటాడు.


మీరు అభిమానంతో ఏది ఇచ్చిన పర్వాలేదని రుద్ర అనగానే లక్ష్మీ ఇద్దరికి బట్టలు పెడుతుంది. నేను మా అమ్మ పెట్టిన చీర కట్టుకొని వస్తానని గంగ అనగానే వద్దని శకుంతల అంటుంది. వెళ్లి కట్టుకొని రా అని పెద్దసారు అంటాడు. దాంతో గంగ చీర మార్చుకోవడానికి వెళ్తుంది. తను గదిలోకి వెళ్లడంతో ఇషిక, పారు కలిసి మస్కిటో కాయిన్స్ పెట్టి మొత్తం పొగ వచ్చేలా చేస్తారు‌‌. దాంతో గంగ స్పృహ తప్పిపడిపోతుంది. బయటనుండి ఇషిక, పారు డోర్ లాక్ వేస్తారు. గంగ ఇంకా రాలేదని స్నేహ పైకి వచ్చి చూస్తుంది. గంగ లేకపోవడంతో అందరు కంగారు పడుతారు. రుద్ర డోర్ గట్టిగ నెట్టి గంగ దగ్గరికి వెళ్తాడు. కింద పడిపోయి ఉన్న గంగని చూసి బెడ్ పై పడుకోబెడతాడు. అప్పుడే అందరూ వస్తారు. కాసేపటికి గంగ స్పృహలోకి వస్తుంది.

ఏం జరిగిందో చెప్తుంది.. ఎవరో బయట డోర్ పెట్టారని గంగ చెప్పగానే ఎవరు ఎందుకు పెడుతారు.. అంతా యాక్టింగ్ అని శకుంతల అంటుంది. ఆ తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. అందరు గిఫ్ట్స్ ఇస్తుంటారు. అప్పుడే పోలీసులు వస్తారు. మీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోమని కంప్లైంట్ ఇచ్చారు కదా తెలిసిందని వాళ్ళు అంటారు. ఎవరు ఇచ్చారని పెద్దసారు అడుగుతాడు. నేనే ఇచ్చానని వీరు అంటాడు. ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ గంగ అని ఇన్‌స్పెక్టర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.