English | Telugu
Shekar Basha: శేఖర్ బాషా మగజాతి ఆణిముత్యమేనా!
Updated : Sep 2, 2024
బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో అందరికి గట్టి పోటీ అనిపించేది మాత్రం శేఖర్ బాషా అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్టేజి పై నాగార్జున తో మాట్లాడిన విధానాన్ని బట్టి గొడవలకి కొదవ లేదని అనిపించింది.
నాతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే కప్ నేనే తీసుకొని పోతానంటూ తన అటిట్యూడ్ తో మాట్లాడాడు. శేఖర్ బాషా RJ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేసాడు. దాదాపు 100 గంటలు మాట్లాడిన RJ గా ఎవరికి రాని గుర్తింపు తెచ్చుకుని అవార్డు సొంతం చేసుకున్నాడు బాషా. కానీ చాలా రోజుల పాటు తెరపై కనిపించలేదు. ఆర్జేగా కూడా అంత ట్రెండింగ్ లో లేడు.. మళ్ళీ బిగ్ బాస్ ద్వారా కేరీర్ ని రీస్టార్ట్ చేస్తున్నాడు.
ఒక నెల రోజులుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా శేఖర్ బాషా పేరే వినిపించింది. హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో దూరిన శేఖర్ బాషా మగాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నానటూ గట్టిగానే ఫైట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్స్‌లో వాదించి చివరికి లావణ్య చేతిలో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. అలాంటి శేఖర్ బాషా మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే ఇప్పటివరకూ ఆర్జేగా ఎవరూ సాధించనన్ని అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు శేఖర్. 18 ఏళ్లలో ఆర్జేగా 8 అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు. 15 ఏళ్ల క్రితమే శేఖర్ ఆర్జేగా సూపర్ పొజిషన్‌లో ఉన్నాడు. ఎంతలా అంటే ఉత్తమ ఆర్జేగా అప్పట్లోనే మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్నాడు శేఖర్. తాజాగా జరిగిన రాజ్ తరుణ్-లావణ్యల విషయంలో ఫుల్ వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి మరి.