English | Telugu

బిగ్ షాక్‌..ఆనంద‌రావు - సౌంద‌ర్య వెళ్లిపోతున్నారా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ సీరియ‌ల్ ద్వారా డాక్ట‌ర్ బాబు గా న‌టిస్తున్న నిరుప‌మ్‌, వంట‌ల‌క్క‌గా న‌టిస్తున్న ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ సెల‌బ్రిటీలుగా మారిపోయారు. వీరి గురించి సెల‌బ్రిటీలే చ‌ర్చించుకునే స్థాయిలో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియ‌ల్ తాజాగా కొంత క్రేజ్ త‌గ్గి షాకిస్తోంది. అయినా ఈ సీరియ‌ల్ కు ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు.

Also Read:కూతురి కోసం రూ. 149 కోట్ల ఇంటిని బాగుచేసిన‌ ప్రియాంక జోడీ!

ఈ గురువారం 1260వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. హోట‌ల్ లో కార్తీక్ ప‌ని చేయ‌డం చూసిన దీప ఆవేశంగా ఊగిపోతూ కార్తీక్ ని కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీస్తుంది. మీరు ఇలాంటి ప‌నులు చేయ‌డం ఏంట‌ని బోరున విల‌పిస్తుంది. బాబుని తీసుకుని ఇంటికి వెళ్లండి అంటూ డాక్ట‌ర్ బాబుపై అర‌వ‌డంతో చేసేదేమీ లేక అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

Also read:మాల్దీవుల్లో బికినీతో కేక‌పుట్టిస్తున్న క‌త్రినా! విక్కీ ఎక్క‌డ‌?

క‌ట్ చేస్తే.. ఆశ్ర‌మంలో ప‌ని చేసే ఓ వ్య‌క్తి ఆనంద‌రావు ద‌గ్గ‌రికి వ‌చ్చి మేడం రుద్రాణిని కొట్టిన ద‌గ్గ‌రి నుంచి మీ గురించి ఎవ‌రెవ‌రో ఎంక్వైరీ చేస్తున్నార‌ని, మీరు ఇక్క‌డ వుండ‌టం క్షేమం కాద‌ని వేరే ఆశ్ర‌మం చూసుకోండ‌ని చెబుతాడు. గుర‌వుగారు మీ క్షేమం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతాడు. మ‌రి అత‌ని మాట‌లు విన్న ఆనంద‌రావు, సౌంద‌ర్య ఆ ఆశ్ర‌మం నుంచి వెళ్లిపోయారా? .. వెళ్లిపోతే కార్తీక్ , దీప ఏం చేశారు? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.