English | Telugu
ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేసిన ఆటో రాంప్రసాద్..
Updated : Jun 4, 2022
స్నేహం ఒక్కసారి చేస్తే చాలు ఇక దాంపత్యమే. వాళ్ళు భార్యాభర్తలే అని మన ఎస్పీ బాలు గారు అన్నారు. అలాంటి గొప్ప ఫ్రెండ్ షిప్ సుడిగాలి సుధీర్ , ఆటో రాంప్రసాద్, గెటప్ సీనుది. 2013 లో సుడిగాలి సుధీర్ టీం లీడర్ అయ్యాడు. ఐతే అప్పట్లో వీళ్ళ ముగ్గురు కలిసి స్కిట్స్ రాసుకుని పెర్ఫామ్ చేసుకుంటూ టీంని ఒక రేంజ్లోకి తీసుకెళ్లారు. జబర్దస్త్ అంటే వీళ్ళ ముగ్గురే గుర్తొచ్చేలా ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు కూడా. ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కూడా వీళ్లకు. ఐతే అప్పట్లో డబ్బుల్లేక, వచ్చేది సరిపోక ఇబ్బందులు పడేవారు ఈ స్నేహితులు. ఐనా సరే ఉన్న వాటిని సర్దుకుంటూ మంచి స్నేహాన్ని కొనసాగించారు.
గెట్ అప్ శీనుకి అదే టైంలో పెళ్లవుతుంది. కానీ భార్యాభర్తలు కలిసి తిరగడానికి మంచి బైక్ కూడా లేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకోవడానికి కూడా ఆటో రాంప్రసాద్ దగ్గర మంచి సెల్ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో వీళ్ళ ముగ్గురూ కలిసి వీటిని కొనుక్కుని ఒకరికి ఒకరు ప్రెజెంట్ చేసుకుంటారు. ఇలా వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసిమెలిసి వుంటారు. ఇంతలో గెటప్ శీను కి మూవీ ఆఫర్ వచ్చేసరికి మూడు నెలలు జబర్దస్త్ ని రాను అంటూ చెప్తాడు. అంతే సుధీర్, రాంప్రసాద్ బాగా ఏడ్చేస్తారు. అక్కడ సినిమా హిట్ కొట్టు, వచ్చి ఇక్కడ స్కిట్ కొట్టు అంటూ రాంప్రసాద్ శీనుకి ధైర్యం చెప్పి టీం ని మేం కాపాడతామంటూ ధైర్యం ఇచ్చి పంపిస్తాడు.
తర్వాత కొద్ది రోజులకు సుడిగాలి సుధీర్ కూడా ఆగిపోయేసరికి ఒక్కసారిగా ఆటో రాంప్రసాద్ కి ఒంటరి ఐపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే ఆపుకోలేక స్టేజి మీద ఏడ్చేస్తాడు. ఇంద్రజ, సదా, రష్మీ, అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వీళ్ళ ముగ్గురి స్కిట్స్ ని ఫాలో అయ్యేవాళ్లే ఉన్నారనుకుంటే వీళ్ళ గొప్ప స్నేహానికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే మాటలు కాదా. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్ళ ముగ్గిరిది అన్నట్టుగా ఉంటారు. ఫ్రెండ్ షిప్ డే ని పురస్కరించుకుని ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో నూకరాజు, కెవ్వు కార్తిక్, రాకింగ్ రాకేష్ అద్దిరిపోయే స్కిట్ పెర్ఫామ్ చేశారు. జూన్ 9 న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రసారం కాబోయే ఈ స్కిట్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యి చూసిన అందరి మనస్సులను బరువెక్కేలా చేస్తోంది.