English | Telugu
అనుని సర్ ప్రైజ్ చేసిన ఆర్య వర్థన్
Updated : Mar 7, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ధారావాహిక `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా బుల్లితెరపై ప్రసారం అవుతూ వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, పగ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ సీరియల్ ని రూపొందించారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ట్విస్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తున్న `ప్రేమ ఎంత మధురం` సోమవారం ఎపిసోడ్ ఎలా వుండబోతోందో ఒకసారి చూద్దాం. ఆర్య వర్థన్ - జెండేల ప్లాన్ పసిగట్టిన రాగసుధ తనని, వశిష్టని వారి నుంచి కాపాడుకుని సుబ్బు ఇంటి నుంచి పారిపోతుంది.
ఊహించని పరిణామానికి ఆర్య వర్థన్ - జెండేలు షాక్ కు గురవుతారు. కట్ చేస్తే పెద్దమ్మ బస్తీలో లోకల్ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టిస్తారు. అడ్డు వచ్చిన ప్రతీ ఒక్కరిని చితకబాది బస్తీని కబ్జా చేశామని, అంతా ఖాలీచేసి వెళ్లిపోవాలని బెదిరిస్తారు. దీంతో చేసేది లేక ఆ విషయాన్ని అను తండ్రి సుబ్బుకి చెబుతారు. ఆలోచించిన సుబ్బు విషయాన్ని అర్యవర్ధన్ కి చెప్పడం.. అందుకు ఆర్య కండీషన్ పెడతాడు. తిరగి పెద్దమ్ తల్లి బస్తీకి వచ్చి అమ్మేసిన ఇంట్లో వుంటానంటేనే తాను ఈ సహాయం చేస్తానంటాడు. అందుకు సుబ్బు కూడా ఓకే అని అయితే ఇల్లు మాత్రం తమ పేరు మీద కాకుండా వుండాలని, అదే సమయంలో అద్దె చెల్లించే విధంగా వుండాలని షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన ఆర్యవర్థన్ ఎమ్మెల్యేకి, అతని మనుషులకు దేహ శుద్ధి చేయడంతో తిరిగి పెద్దమ్మతల్లి బస్తీ హస్తగత మవుతుంది.
Also Read:బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ అవుట్.. ఏడ్చేసిన సరయు!
అంతా సంబరాల్లో వుంటే ఆర్యవర్థన్ ఆ పేపర్లని బస్తీవాసులకు అందజేసే పనిని అనుకి అప్పగిస్తాడు. ఊహించని పరిణామానికి ఆనందం పట్టలేని అను ఆర్యవర్థన్ ని హగ్ చేసుకుని ఆన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎప్పుడే అనుతో అన్న మాటలు నిజం కావడంతో ఆర్య కూడా ఆనందిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? .. సుబ్బు ఇంటి నుంచి ఆర్య వర్థన్ - జెండేల కారణంగా పారిపోయిన రాగసుధ ఎక్కడ తలదాచుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.