English | Telugu

పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్నదే నా కోరిక...


ఖుష్బూ అటు సినిమా రంగంలో ఇటు టీవీ రంగంలో పొలిటికల్ గా కూడా ఆమెకు ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి ఖుష్బూతో ఒక ఛానెల్ సరదాగా జరిపిన చిట్ చాట్ లో ఆమె ఎన్నో విషయాలు చెప్పారు. స్కూల్ లో నా పేరు నక్కత్ ఖాన్ .. ఐతే స్కూల్ టైం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను అప్పుడే ఖుష్బూ అని పేరు మార్చేశారు. నేను ముస్లింని. నక్కత్ అంటే అర్ధం ఖుష్బూ అందుకే పేరు మార్చేశారు. వెంకటేష్, కమల్ సర్, చిరంజీవి, సుహాసిని అంటే ఇష్టం. రాజమౌళి అంటే మూవీని చాలా గ్రాండ్ లుక్ లో చూపించడానికి ట్రై చేస్తారు, త్రివిక్రమ్ పక్కా కమర్షియల్. పొలిటికల్ గా నేను ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు..

నా గోల్ ఏంటంటే నేను పార్లమెంట్ కి వెళ్ళాలి. జయలలిత, సీనియర్ ఎన్టీఆర్, నరేంద్ర మోడీ వీరంతా నాకు ఇన్స్పిరేషన్. 80 స్ రి-యూనియన్ లో అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. మేము కొంతమందిమి కలిసి కోర్ కమిటీగా ఏర్పడడం. ఎప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకోవాలి..ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవాలి వంటివన్నీ మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్రతీ ఇయర్ ఈ రీయూనియన్ జరుగుతుంది. మేమంతా బాగా అల్లరి చేస్తాం. వెంకటేష్ తో నటించిన కలియుగ పాండవులు అంటే నాకు చాలా ఇష్టం.. అదెప్పుడూ నా మనసులోంచి పోదు. సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో ఇంత సక్సెస్ కావడానికి కారణం డెడికేషన్" అంటూ ఎన్నో విషయాలు చెప్పింది ఖుష్బూ..

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.