English | Telugu
రగిలిపోతున్న అభిమన్యు.. కోర్టులో షాకిచ్చిన వేద
Updated : Mar 8, 2022
బుల్లితెరపై ఇటీవలే ప్రారంభమైన సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ కీలక పాత్రల్లో నటించారు. ఓ పాప చుట్టూ ప్రధానంగా ఈ సీరియల్ సాగుతోంది. తల్లి కాలేని ఓ యువతి పాప కోసం ఎలాంటి త్యాగానికి సిద్దపడింది? అన్న ప్రధాన కథాంశంతో ఈ సీరియల్ ఆత్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఖుషీ కోసం యష్ ని పెళ్లాడిన వేద అత్తారింట్లోకి అడుగుపెడుతుంది. తన లగేజ్ ని తీసుకుని యష్ రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఏంటీ నా రూమ్ లోకి వచ్చావ్ అంటాడు యష్..ఖుషీ కోసమే ఇదంతా అని చెబుతుంది వేద.
యష్ నైస్ గా మాట్లాడటాన్ని గమనించిన వేద వెంటనే మాటలు కలిపి దగ్గరవ్వాలనుకుంటే కుదరదు అంటుంది వేద.. వెంటనే నేను నీకు దగ్గరవ్వాలనుకోవడం ఏంటీ? అంటాడు యష్.. కట్ చేస్తే .. యష్ - వేదలకు పెళ్లి జరగడంతో ఖుషీ ఆనందిస్తుంటుంది. పాప ఆనందాన్ని చూసి అభిమన్యు రగిలిపోతుంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకో అని మాళివికతో చెబుతాడు. అభిమన్యు అడగ్గానే ఖుషీ దగ్గరికి వెళ్లి `పెళ్లి బాగా జరిగిందా? అని అడుగుతుంది మాళవిక. తేదు అంతా ఏడుస్తున్నారని చెబుతుంది ఖుషీ. ఈ మాటలు విన్న మాళవిక ఇంకా ఇంకా కుళ్లి కుళ్లి ఏడవాళి వాళ్లు అని మనసులో అనుకుంటుంది.
కట్ చేస్తే .. కోర్టులో యష్ భార్యగా వేద ఎంట్రీ ఇవ్వడం చూసి మాళవిక, అభిమన్యు ఒక్కసారిగా షాక్ కు గురవుతారు. యష్ పక్కన కూర్చున్న వేద మెడలో తాళిని చూసి మాళవిక మరింతగా కంగారుపడుతుంది. హియరింగ్ గ్యాప్ లో వేదని బయటికి తీసుకొచ్చి ఏంటీ నువ్వు చేసిన పని అంటూ మాళవిక నిలదీస్తుంది. ఖుషీని కాపాడుకోవాలని అనే పట్టుదల అని చెబుతుంది వేద. ఈ మాటలకు ఆగ్రహించిన మాళవిక నువ్వు నన్ను వెన్ను పోటు పొడిచావ్ అంటూ వేద పై కి చేయి ఎత్తుతుంది. వెంటనే మాళిని చేయి అందుకున్న వేద ఉరిమి చూస్తుంది... ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి మధ్య ఏం జరగబోతోంది? కథ ఎలాంటి మలుపులు