English | Telugu
Brahmamudi : రుద్రాణి మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రాహుల్!
Updated : Oct 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -865 లో.. రాహుల్ అలా బెహేవ్ చేస్తున్నాడని కావ్య బాధపడుతుంటే.. రాజ్ వచ్చి వాడితో మాట్లాడి వాడికి బుద్ది చెప్తాను కానీ నువ్వు భోజనం చేయమని చెప్తాడు. ఆ తర్వాత స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. ఇక అవసరం లేదులే ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాహుల్ అనగానే స్వప్న షాక్ అవుతుంది.
రాహుల్ ని తిడుతుంది.. ఒక కూతురు ఉంది తన గురించి కూడా ఆలోచించాలి కదా అని అనగానే తనకేంటే ఈ ఇంట్లో లోటు లేదని రాహుల్ అంటాడు. దాంతో స్వప్న కోపంగా ఆ విడాకుల పత్రాలు తీసుకొని రుద్రాణి దగ్గరికి వెళ్లి తన ముందు పెడుతుంది. మీ అబ్బాయి విడాకులు అడుగుతున్నాడని స్వప్న చెప్పగానే అందరు షాక్ అవుతారు. అప్పుడే రాహుల్ వచ్చి అవును.. నాకు స్వప్న అంటే ఇష్టం లేదు.. నాకు పిల్ల వద్దు తల్లి వద్దని అందరి ముందే చెప్తాడు. దాంతో సుభాష్ తనపై కోప్పడతాడు. రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందరు రుద్రాణిని తిడుతుంటే రాహుల్ దగ్గరికి వెళ్తుంది. రాహుల్ వెళ్లేసరికి లగేజ్ తో బయల్దేరతాడు. రుద్రాణి వెళ్లి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది.
మమ్మీ నాకూ స్వప్న అంటే ఇష్టం లేదు.. నాకు కోయిలా అనే అమ్మాయి అంటే ఇష్టం.. తను కోటీశ్వరురాలు.. తనతో ఉంటే లైఫ్ సెటిల్ అని అంటాడు. బయటవాళ్లని నమ్మడానికి లేదని రుద్రాణి అంటుంది. అంత నాకు తెలుసు.. అందరి ముందు నువ్వు నన్ను తిట్టినట్లు యాక్టింగ్ చెయ్ చాలు అని రుద్రాణితో రాహుల్ చెప్తాడు. మరొకవైపు రాహుల్ ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. తరువాయి భాగం లో కోయిలా దగ్గరికి రాహుల్ వెళ్తాడు. రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.