"హిమను చంపింది నేనే" అని చెప్పిన మోనిత... అంజిని కూడా చంపిందా?
కార్తీక్ కోసం మోనిత ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పడానికి ఈ రోజు ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే, కార్తీక్ మీద మోజులో మోనిక ఎంత తప్పు చేయడానికైనా వెనుకాడదని, హత్యలు చేయడానికి ఓ క్షణం కూడా ఆలోచించదని ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇంతకీ, బుధవారం (ఆగస్టు 4, 2021) 1109 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే... ఎయిట్ హోటల్లో ఉన్న అంజి కోసం వంటలక్క అలియాస్ దీప, మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే.