English | Telugu

మోనితకు దిమ్మతిరిగే షాక్... కార్తీక్‌తో పెళ్లికి అంజి బ్రేక్!

మోనిత ఆటలకు వంటలక్క చెక్ పెట్టింది. చెప్పినట్టు అంజిని లైనులోకి తీసుకొచ్చింది. ముందుగా డాక్టర్ బాబుతో మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలని ఉబలాటపడుతున్న మోనిత ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. మొత్తం మీద 'కార్తీక దీపం' సీరియల్ అభిమానుల్లో జూలై 29న ప్రసారమయ్యే 1104 ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మరింత కలిగించడంలో సక్సెస్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ విశేషాలు ఏంటంటే...

ఇంటికి వచ్చిన తర్వాత మోనితకు ఏమైంది? అలా ప్రవర్తిస్తోందేంటి? అని వంటలక్క అలియాస్ దీపను భాగ్యం అడుగుతుంది. తన భర్త మీద మోజు పడిందని, దానిని ఎలా వదిలించుకోవాలో తనకు తెలుసు అని చెబుతుంది. ఆల్రెడీ వంటలక్క తన ప్లాన్ అమలుచేసిందని తర్వాత సన్నివేశంలో ప్రేక్షకులకు తెలుస్తుంది.

మోనితకు రిజిస్టర్ దుర్గాప్రసాద్ నుండి ఫోన్ వస్తుంది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ తో ఆమె పెళ్లికి అంజి అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడని, అతడిని 25వ తేదీలోపు ఒప్పిస్తేనే మీ పెళ్లి జరుగుతుందని చెబుతాడు. వంటలక్క దెబ్బకు మోనితకు దిమ్మ తిరుగుతుంది. దీపను తక్కువ అంచనా వేసి తప్పు చేశానని బాధ పడుతూ, ఏదొకటి చేసి 25న కార్తీక్ ను పెళ్లి చేసుకుని తీరుతానని మనసులో అనుకుంటుంది.

తర్వాత ఆనందరావును డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడం, మోనిత-అంజి మధ్య శత్రుత్వానికి కారణం ఏమై ఉంటుందని కార్తీక్ ఆలోచిస్తూ ఉండటంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఫైనల్ పంచ్ ఏంటంటే... మోనితకు రోషిణి కాల్ చేసి 'ఒకసారి రండి. మాట్లాడాలి' అనడం, మోనిత ఇంట్లో దీప ఎంట్రీ ఇవ్వడం! జూలై 30న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.