English | Telugu

రోజుకు భావ‌న సంపాద‌న ఎంతో తెలుసా?!

దాదాపు ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలం నుంచీ టీవీ వీక్ష‌కుల‌కు భావ‌న తెలుసు. న‌టిగా, ప్ర‌యోక్త‌గా తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన తార‌ల్లో భావ‌న ఒక‌రు. మొద‌ట్లో హీరోయిన్‌గా సీరియ‌ల్స్‌లో క‌నిపించిన ఆమె, ఇప్పుడు నెగ‌టివ్ రోల్స్‌లో, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపిస్తోంది. ఇంత కాలం టీవీ ఇండ‌స్ట్రీలో ఉంది కాబట్టి ఆమె బాగానే సంపాదించి ఉంటుంద‌నేది చాలామంది అభిప్రాయం. ఆమె రెమ్యూన‌రేష‌న్ ఎంత తీసుకుంటుంద‌నే టాపిక్ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంటుంది.

ఆమె పారితోషికం ఎంత‌నే విష‌యం ప‌క్క‌న‌పెడితే త‌న ఆదాయంలో కొంత చారిటీకి వెచ్చించే మంచి ల‌క్ష‌ణం భావ‌న సొంతం. మ‌నం సైతం కోసం త‌న‌కు తోచిన‌ప్పుడ‌ల్లా వెయ్యో, రెండో వేలో ఇస్తూ ఉంటుంది. ఇలా ఒక్క‌సారి కాదు, ఆ గ్రూప్‌కు చాలా సార్లు ఆమె డ‌బ్బులు ఇచ్చింది. వీటిని ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే, వారి చికిత్స కోసం వెచ్చిస్తుంటారు. సాధారణంగా సినీ, టీవీ సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో పిల్ల‌ల బ‌ర్త్‌డేస్ వ‌స్తే గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తుంటారు. కానీ భావ‌న అలాంటి సెల‌బ్రేష‌న్స్ చెయ్య‌లేదు. వాళ్ల పుట్టిన‌రోజు నాడు కేన్స‌ర్ హాస్పిట‌ల్‌లో ఉండే రోగుల‌కు భోజ‌నం పెడుతుంటుంది.

గ‌త ఏడాది ఆమె ఇంకో మంచి ప‌నిచేసింది. మ‌న‌కు ఇష్ట‌మొచ్చిన ఫుడ్ త‌యారుచేసి వాళ్ల‌కు పెట్ట‌డం కంటే, వాళ్ల‌కు ఇష్ట‌మైన ఆహారాన్నే వాళ్ల‌తో తినిపించాల‌నే ఆలోచ‌న ఆమెకు వ‌చ్చింది. స్టార్ ఫౌండేష‌న్ ద్వారా వాళ్ల‌ను మ‌ధ్యాహ్నం హోట‌ల్‌కు ర‌ప్పించి.. దాదాపు 35 మందికి బిర్యానీ స‌హా ఎవ‌రికి ఏమేం తినాల‌నిపిస్తుందో, ఆ భోజ‌నం పెట్టించిందామె. వారి బిల్లు మొత్తం త‌నే చెల్లించింది. ఇలాంటి మంచి హృద‌యం భావ‌న‌ది.

స‌రే ఇంత‌కీ భావ‌న రెమ్యూన‌రేష‌న్ ఎంత‌? "ఒక సీరియ‌ల్‌కు రోజుకు 5 వేలు, ఇంకో సీరియ‌ల్‌కు 6 వేలు, మ‌రో సీరియ‌ల్‌కు 7 వేలు ఇస్తున్నారు. వీటిలో అసిస్టెంట్స్ క‌న్వీయ‌న్స్‌, టీడీఎస్‌, పెట్రోల్ ఖ‌ర్చులు లాంటివ‌న్నీ ఉంటాయి. చివ‌ర‌కు మిగిలేది చాలా త‌క్కువ." అని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది భావ‌న‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.