English | Telugu

ఒకే కారులో వంటలక్క, మోనిత... అంజి ఎవరికి దొరికాడు?

అంజి పాత్రను అడ్డం పెట్టుకుని 'కార్తీక దీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర సీరియల్‌ను నడిపిస్తున్న తీరు రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. థ్రిల్లర్ సినిమా తరహాలో కథను ముందుకు తీసుకువెళ్తున్నారు. భర్తకు అబద్ధం చెప్పిన వంటలక్క, ఎక్కడికి వెళుతున్నానో ప్రియమణికి చెప్పకుండా బయలుదేరిన మోనిత... చివరకు ఒకే కారులో చేరారు. మరి, కారులో వంటలక్క ఉన్న సంగతి మోనితకు తెలుస్తుందా? డాక్టర్ బాబు టెన్షన్ పడుతున్నట్టు వంటలక్కను మోనిత ఏమైనా చేస్తుందా? అనేది రేపటి (బుధవారం) ఎపిసోడ్ లో చూడాలి. నేటి (మంగళవారం, ఆగస్టు 3) ఎపిసోడ్‌లో అయితే... మోనితకు దీప గురించి తెలియలేదు. అసలు, ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూస్తే...

సూర్యాపేటలోని ఎయిట్ హోటల్‌లో అంజి ఉన్నాడని వంటలక్క అలియాస్ దీపకు ఏసీపీ రోషిణి ఫోన్ చేసి చెబుతుంది. వెంటనే అక్కడికి వెళ్లమని, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌కు విషయం చెప్పవద్దని చెబుతుంది. అయితే, అంజి అక్కడ ఉన్నట్టు మోనితకు తన మనుషుల ద్వారా సమాచారం అందుతుంది.

తన పిన్నికి బాలేదని భర్త డాక్టర్ బాబుకు అబద్ధం చెప్పిన వంటలక్క ఇంటి నుండి బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం ఇంటికి వస్తానని చెబుతుంది. మరోవైపు మోనిత కూడా ఎక్కడికి అనేది ప్రియమణికి చెప్పకుండా ఇంటి నుండి బయటకొస్తుంది. కారులో వెళ్తూ వెళ్తూ గన్ చెక్ చేసుకుంటుంది. అంజి మాట వినకపోతే తుపాకీతో బెదిరించాలని ప్లాన్ వేస్తుంది.

వంటలక్క ఫోన్ ఇంటిలో మర్చిపోవడంతో తనకు అబద్ధం చెప్పిందని డాక్టర్ బాబుకు అర్థం అవుతుంది. పిన్ని దగ్గరకు వెళ్తున్నానని వంటలక్క చెబుతుంది కదా! అదే పిన్ని భాగ్యం నుండి ఫోన్ రావడంతో డాక్టర్ బాబు లిఫ్ట్ చేస్తాడు. దాంతో పిన్ని దగ్గరకు భార్య వెళ్లలేదని తెలుసుకుంటాడు. వెంటనే మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడ మోనిత కూడా లేదని తెలుసుకున్నాక అతడిలో టెన్షన్ మొదలవుతుంది.

సీన్ కట్ చేస్తే... మోనిత కారు ట్రబుల్ ఇస్తుంది. దారి మధ్యలో ఆగడంతో లిఫ్ట్ కోసం అందర్నీ అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వంటలక్క కారు వస్తుంది. మోనితను డ్రైవింగ్ చేస్తున్న వెంకటేష్ గుర్తు పడతాడు. లిఫ్ట్ ఇవ్వాలా? వద్దా? అని వంటలక్కను అడుగుతాడు. తాను కారులో ఉన్నట్టు చెప్పకుండా లిఫ్ట్ ఇవ్వమని వంటలక్క చెబుతుంది. కానీ, మనసులో ఆందోళన మొదలవుతుంది. అంజి గురించి మోనితకు తెలిసిందా? అని! చివరకు, ఆమె అనుమానం నిజమవుతుంది. మోనితకు ఫోన్ రావడం, అవతలి వ్యక్తితో ఎయిట్ హోటల్‌కు వస్తున్నట్టు ఆమె చెప్పడంతో వంటలక్క షాక్ అవుతుంది.

మరోవైపు భార్య గురించి డాక్టర్ బాబు టెన్షన్ పడతాడు. తమ్ముడు ఆదిత్యతో విషయం చెబుతాడు. మోనిత చేతిలో గన్ ఉందని, తన మనుషులు ఉన్నచోటుకు వెళుతుందని, అదేమైనా వంటలక్కను ఏమైనా చేస్తుందేమోనని అంటాడు.

మరి, అంజి ఎవరికి దొరికాడు... మోనితకా? వంటలక్కకా? తరవాత ఎపిసోడ్ లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.