English | Telugu

22 ఏళ్ళ 'నువ్వు నాకు నచ్చావ్'.. రిరిలీజ్ కి స్పెషల్ డేట్!?

తెలుగునాట కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. తను నటించిన ఫ్యామిలీ డ్రామాలెన్నో బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్'ది ప్రత్యేక స్థానం. 'నువ్వే కావాలి' వంటి ఘనవిజయం తరువాత దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన ఈ సినిమాకి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చారు. ఇందులో వెంకటేశ్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించింది. తనకిదే మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్, ఆశా షైనీ, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సుధ, హేమ, బేబి సుదీప, తనికెళ్ళ భరణి, సిజ్జు, శ్రీలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.