English | Telugu
కొత్త దర్శకులతో పవన్ మెమరబుల్ హిట్స్.. ఆ చిత్రాలేంటో తెలుసా?
Updated : Sep 1, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కొంతమంది నూతన దర్శకులకు అవకాశమిచ్చి ప్రోత్సహించారు. అంతేకాదు.. తనని తనే స్వయంగా డైరెక్ట్ కూడా చేసుకున్నారు. ఇలా.. డెబ్యూ డైరెక్టర్స్ తో పవన్ చేసిన కొన్ని ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం రాబట్టాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
1. తొలిప్రేమ: ఒక కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రమిది. ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1998 జూలై 24న ఈ సినిమా రిలీజైంది.
2. తమ్ముడు: బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీతో.. పి.ఎ. అరుణ్ ప్రసాద్ కెప్టెన్ గా మొదటి అడుగేశారు. 1999 జూలై 15న ఈ సినిమా జనం ముందు నిలిచింది.
3. బద్రి: పవన్ కళ్యాణ్ లోని నటుడ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రంతోనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలిసారి మెగాఫోన్ పట్టారు.
(సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా..)