'బచ్చన్ పాండే'గా భయపెడుతున్న అక్షయ్ కుమార్!
అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్‌గా చేస్తోన్న 'బచ్చన్ పాండే' మూవీ 2022 మార్చి 18న విడుదలవుతోంది. ఈ మూవీలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి కీలక పాత్రధారులు. తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ' (తెలుగులో 'గద్దలకొండ గణేష్')కు ఇది రీమేక్. అక్షయ్ ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఈరోజు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అక్షయ్, ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశాడు.