English | Telugu

ముంబైలో ఒకేసారి రెండు కొత్త ఫ్లాట్‌లు కొన్న కాజోల్‌! ధ‌ర ఎంతంటే...

అజ‌య్ దేవ్‌గ‌ణ్ భార్య‌, బాలీవుడ్ తార కాజోల్ ముంబైలోని త‌మ ఆస్తుల్లో మ‌రో రెండు ఖ‌రీదైన ఫ్లాట్‌ల‌ను చేర్చింది. ముంబైలోని సంప‌న్నులు నివాసం ఉండే జుహు ఏరియాలో ఆమెకు ఇప్ప‌టికే శివ్‌శ‌క్తి అనే బంగ్లా ఉంది. దానికి స‌మీపంలోనే ఇప్పుడామె రెండు కొత్త ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేసింది. వీటి కోసం ఆమె రూ. 11.95 కోట్ల‌ను వెచ్చించింది. ఆ ఫ్లాట్‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను Squarefeatindia.com వెల్ల‌డించింది. ఆ ఫ్లాట్‌ల‌కు సంబంధించిన ప్రాప‌ర్టీ డాక్యుమెంట్ల‌ను సంపాదించిన ఆ వెబ్‌సైట్‌, ఆ రెండు ఫ్లాట్‌లు అపార్ట్‌మెంట్‌లోని 10వ అంత‌స్తులో ఉన్న‌ట్లు తెలిపింది.

ఆ వెబ్‌సైట్ ప్ర‌కారం, రెండు ఫ్లాట్‌ల కార్పెట్ ఏరియా సుమారు 2,000 చ‌ద‌ర‌పు అడుగులు ఉంటుంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఈ ఫ్లాట్‌ల‌ను రిజిస్ట‌ర్ చేయించారు. ప్ర‌స్తుతం తాము ఉంటున్న శివ్‌శ‌క్తి బిల్డింగ్ ఉన్న రోడ్డులోనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో కాజోల్ ఈ ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ల‌పై కాజోల్ విశాల్ దేవ్‌గ‌ణ్ అనే సంత‌కం ఉంది. త్రిక్షా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందాన్ని ఆమె కుదుర్చుకుంది.

కాజోల్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'త్రిభంగ' అనే మూవీలో చివ‌రిసారిగా క‌నిపించింది. అందులో ఆమె అనూరాధ ఆప్టే అనే పాత్ర‌ను చేసింది. దీంతో పాటు 'దేవి' అనే షార్ట్ ఫిల్మ్ చేసింది కాజోల్‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.