English | Telugu

'గంగూబాయ్' ట్రైల‌ర్‌.. ఆలియా అద‌ర‌హో.. అజ‌య్ అదుర్స్‌!

ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ క‌లిసి న‌టించిన 'గంగూబాయ్ క‌థియ‌వాడి' మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1960ల‌లో ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాఠిపుర‌ను ఏలిన గంగూబాయ్ జీవిత క‌థ‌ను మ‌న‌ముందు ప్రెజెంట్ చేస్తుంది. ఇంత‌దాకా ఆలియా కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఎందులో క‌నిపించిందంటే, 'రాజీ' పేరునే చెబుతారు ఎక్కువ‌మంది. వాళ్లంతా త‌మ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.

బాలీవుడ్ బెస్ట్ యాక్ట్రెస్‌ల‌లో తాను ముందు వ‌రుస‌లో ఉంటాన‌ని గంగూబాయ్ క్యారెక్ట‌ర్‌తో మ‌రోసారి నిరూపించుకుంది ఆలియా. ఆమె డైలాగ్ డెలీవ‌రీ, మేన‌రిజ‌మ్‌, ఎక్స్‌ఫ్రెష‌న్స్‌.. అన్నీ వండ‌ర్‌ఫుల్ అనిపించే రీతిలో ఉన్నాయి. త‌న మునుప‌టి పాత్ర‌ల న‌ట‌న‌తో పోలిస్తే, భ‌న్సాలీ డైరెక్ష‌న్‌లో గంగూబాయ్‌గా ఆమె న‌ట‌న మ‌రో మెట్టు పైకెక్కింద‌నేది నిజం. ట్రైల‌ర్‌కు సంబంధించిన మ‌రో హైలైట్‌.. అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఎంట్రీ. ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ గ్యారంటీ.

భ‌న్సాలీ సినిమాల్లో మ్యూజిక్ అనేది కీల‌క పాత్ర వ‌హిస్తుంద‌ని మ‌న‌కు తెలుసు. 'గంగూబాయ్ క‌థియ‌వాడి' అందుకు మిన‌హాయింపు కాదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్‌లో ఉంది. ట్రైల‌ర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో తెలిసిపోతోంది. ఫిబ్ర‌వ‌రి 25న మ‌న‌ముందుకు వ‌స్తున్న పూర్తి సినిమా ఏ రీతిలో మ‌న‌ల్ని మెస్మ‌రైజ్ చేస్తుందో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.