English | Telugu

Kannappa : 'ఓజీ'కి ఎక్కువ.. 'రాజాసాబ్'కి తక్కువ..!

Kannappa : 'ఓజీ'కి ఎక్కువ.. 'రాజాసాబ్'కి తక్కువ..!

Publish Date:Jun 6, 2025

  కొందరు తమ సినిమాకి అంత బడ్జెట్ అయింది, ఇంత బడ్జెట్ అయిందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం బడ్జెట్ ఎంత అయిందో చెప్పడానికి ఇష్టపడరు. కానీ, మంచు విష్ణు మాత్రం.. చెప్పీ చెప్పనట్టుగా.. అర్థమై కానట్టుగా బడ్జెట్ ని చెప్పేశారు. (Kannappa Movie)   మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రాన్ని మంచు ఫ్యామిలీనే భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఆ బడ్జెట్ ఫిగర్ ఎంత అనేది కరెక్ట్ గా బయటకు తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బడ్జెట్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైతే.. విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ 'ఓజీ' కంటే కాస్త ఎక్కువ, ప్రభాస్ 'రాజాసాబ్' కంటే కాస్త తక్కువ అని విష్ణు చెప్పాడు. అయితే నెంబర్ మాత్రం చెప్పలేదు. ఎంతో చెబితే ఐటీ వాళ్ళు వస్తారు (నవ్వుతూ) అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.   కన్నప్పలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటించారు. దాదాపు సినిమా అంతా న్యూజిల్యాండ్ లోనే షూటింగ్ జరుపుకుంది. విష్ణు మాటలను బట్టి చూస్తే.. కన్నప్ప బడ్జెట్ రూ.200 కోట్లు దాకా అయ్యుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
Housefull 5 Movie Review

Housefull 5 Movie Review

Publish Date:Jun 6, 2025

Cast: Akshay Kumar, Riteish Deshmukh, Abhishek Bachchan, Sanjay Dutt, Fardeen Khan, Shreyas Talpade, Nana Patekar, Jackie Shroff, Dino Morea, Jacqueline Fernandez, Nargis Fakhri, Chitrangada Singh, Sonam Bajwa, Soundarya Sharma, Chunky Pandey, Nikitin Dheer, Johnny Lever Crew:  Written by Farhad Samji, Tarun Mansukhani, Sajid Nadiadwala Music by Yo Yo Honey Singh, White Noise Collectives, Tanishk Bagchi, Kratex, Julius Packiam Editing by Rameshwar S. Bhagat Cinematography by V. Manikandan Directed by Tarun Mansukhani Produced by Sajid Nadiadwala, Warda Nadiadwala, Firuzi Khan Housefull franchise has been one of the most consistent entertainers for Akshay Kumar, Riteish Deshmukh. With different directors and actors, they could gel within and deliver box office hits. While the quality of films has been on a decline from the first to till date, still, they are people who would walking into a theatre to watch Housefull film. So, let's discuss about Housefull 5 released in A and B versions, with two climaxes, in detail.  Plot:  Papa Ranjeet (Ranjith) leaves a will that he has a son named Jolly and his property should be given to him. The next-in-line heir and Board Member Dev (Fardeen Khan) sends out detectives to find Jolly and bring him to the luxury boat. Jalabuddin (Riteish Deshmukh) walks in with Zara (Sonam Bajwa) and claims to be Jolly. Jalbhushan (Abhishek Bachchan) walks in as Jolly 2 with Sasikala (Jacqueline Fernandez) as his wife. Finally, Julius (Akshay Kumar) walks in as Jolly 3 with his wife Kaanchi (Nargis Dutt). Confused Dev orders a DNA test of all three. But the doctor gets murdered.  Close relatives and board members Bedi (Dino Morea), Shiraz (Shreyas Talpade) and Maya (Chitrangada Singh) along with Lawyer Lucy (Soundarya Sharma) fall under suspicion. Cook Aakhri Pasta (Chunky Panday) and security officer Batuk Patel (Jonny Lever) are always fighting while Captain Sameer (Nikitin Dheer) looks suspicious. But all three Jollys interchange their wives and are connected with doctor's murder. To investigate who is the killer police officers Baba (Jackie Shroff) and Bhiddu (Sanjay Dutt) arrive on the ship while their head officer Dhagdu (Nana Patekar)  Analysis:  The makers have always tried to fill up the Housefull franchise films with huge ensemble casts bringing in different stars under one roof. But the main plot has been thick in first two while next two just tried to go bizarre with comic gimmicks. In 5th installment, they have brought in Sanjay Dutt, Jackie Shroff, Nana Patekar, Fardeen Khan, Dino Morea, Chitrangada Singh but none of them have any character to really talk about.  Abhishek Bachchan, Riteish Deshmukh, Akshay Kumar everyone tried to do over action with the written material but nothing really lands. Each comical punch tries to go excruciatingly below the belt and then even more weird and bizarre just for the sake of it. In every punchline, established joke, you can see how each one tried hard to make it feel comical. Below the belt jokes does bring some chuckles but none of them have any substantial set up or pay off.  It feels like makers are exhausted off any new ideas to bring in something fresh to this franchise or ensemble comedy. Sanjay Dutt and Jackie Shroff have been given such loose material that we get annoyed rather than excited by their presence. Even more problematic are the characters written to ladies. Each one is asked to show off their skin even more even in unnecessary scenes. Its like they have been hired to showcase something - if not acting skills, then some skin at least.  Housefull as a franchise itself always boasted off being over-the-top and silly with weird jokes but never it tried to be clever. Still, the punchlines need set up, the hilarious stretches need structure and the unique fun line or reaction or expression needs the character to be established in similar fashion. Housefull till 3 did try to imbibe some sort of structure but now, they seem to be throwing stones at low hanging fruits and failing at even that too.  A clever and in-form director might have been able to use Knives Out kind of a premise better with silliness being limited to one or two characters or some sort of emotion being induced in some characters. Even sans emotion, the laughter riot would have worked had the makers did not seem desperate asking "laugh ... laugh" rather than genuinely evoking such a reaction with their silly and clever antics. Doesn't have even one redeeming quality rather than being a random assemble of ensemble cast, old jokes, rehashes and predictable ones at that.  Bottomline:  Housefull 5 tries too hard that you feel sympathy for all the ensemble cast who are there are a paycheck than you care for the characters or the story or even the non-existent comedy.  Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' doiscretion is advised. 

Thug Life Movie Review 

Publish Date:Jun 5, 2025

ఆ ఒక్క సినిమా మూవీ మొఘల్‌ జీవితాన్ని మార్చేసింది!

Publish Date:Jun 6, 2025

(జూన్‌ 6 మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు జయంతి సందర్భంగా..) సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు నటీనటులుగా రాణించడానికి ఇష్టపడతారు, మరికొందరు సాంకేతిక నిపుణులుగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. మరికొందరు మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాంటి ఓ బలమైన కోరికతో సినిమా రంగానికి వచ్చారు మూవీ మొఘల్‌ డా.డి.రామానాయుడు. తను ఏ పనిచేసినా నెంబర్‌ వన్‌గా ఉండాలని ఇష్టపడే రామానాయుడు.. సినీ రంగానికి రాకముందు కొన్ని వ్యాపారాలు చేశారు. అందులోనూ నెంబర్‌వన్‌ అనిపించుకొని నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి సినిమా రంగంలోనూ నెంబర్‌వన్‌గా నిలిచారు డి.రామానాయుడు.  1936 జూన్‌ 6న ప్రకాశం జిల్లా కారంచేడులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు దగ్గుబాటి రామానాయుడు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. రామానాయుడు మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత పిల్లలను తండ్రి వెంకటేశ్వర్లు పెంచి పెద్ద చేశారు. మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు రామానాయుడు. ఆ తర్వాత కారంచేడు వచ్చి రైస్‌మిల్లు, ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేశారు. ఆ సమయంలోనే నమ్మినబంటు షూటింగ్‌ కారంచేడులో చేశారు. ఆ సినిమాలో రామానాయుడు ఒక చిన్న పాత్ర కూడా చేశారు. ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో సినిమాల్లోకి రమ్మని అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు. అలా సినిమా రంగంవైపు అడుగులు వేశారు రామానాయుడు.  1962లో కొందరు భాగస్వాములతో కలిసి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. అయితే ఆ సినిమాకి పెట్టుబడి పెట్టినా నిర్మాతగా ఆయన పేరు వెయ్యడం కుదరదని చెప్పారు. అయితే షూటింగ్‌కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇన్‌వాల్వ్‌ అవుతానని ఆ దర్శకనిర్మాతలకు చెప్పారు రామానాయుడు. అలా ఆ సినిమాను పూర్తి చేసి 1962 జూన్‌లో రిలీజ్‌ చేశారు. అది మంచి సినిమా అని పేరొచ్చినప్పటికీ డబ్బు రాలేదు. దాంతో అదే సంవత్సరం తన పెద్ద కుమారుడు పేరుతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ఎన్‌.టి.రామారావుతో ‘రాముడు భీముడు’ చిత్రాన్ని తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి డూయల్‌ రోల్‌ సినిమా ఇదే. 1964 మే 21న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. ‘రాముడు భీముడు’ తర్వాత కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. ఆ సినిమా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావుతో ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ, ఆశించినంత విజయం సాధించలేదు. 1970లో జగ్గయ్య హీరోగా ‘ద్రోహి’ చిత్రం చేశారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందించింది. దాంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు రామానాయుడు. అదే సమయంలో ‘ప్రేమనగర్‌’ చిత్రం చేసేందుకు సిద్ధపడ్డారు. ఆరోజుల్లోనే 15 లక్షలతో ఈ చిత్రాన్ని ఎంతో భారీగా నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే సినిమా రంగాన్ని వదిలేసి వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. 1971 సెప్టెంబర్‌ 24న ‘ప్రేమనగర్‌’ రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజ్‌ రోజు నుంచి రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంత వర్షంలోనూ రిలీజ్‌ అయిన అన్ని సెంటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అయింది ‘ప్రేమనగర్‌’. తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.  ఆ మరుసటి సంవత్సరమే శివాజీగణేశన్‌తో ‘వసంత మాళిగై’ పేరుతో ప్రేమనగర్‌ను తమిళ్‌లో రీమేక్‌ చేశారు రామానాయుడు. అక్కడ కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత రాజేష్‌ఖన్నాతో ‘ప్రేమ్‌నగర్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఇలా ప్రేమనగర్‌ సాధించిన విజయంతో నిర్మాతగా స్థిరపడిపోయారు రామానాయుడు. ఆ తర్వాత వరసగా జీవనతరంగాలు, సోగ్గాడు, చక్రవాకం, దేవత, ముందడుగు, మండే గుండెలు, అహనా పెళ్ళంట, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలు, చిన్న హీరోలతో ఒకదాని వెంట ఒకటి సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ వెళ్ళారు. అలాగే హిందీలో కూడా చాలా హిట్‌ సినిమాలు నిర్మించారు. 13 భాషల్లో 150 సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించారు రామానాయుడు.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. రామానాయుడు వివాహం 1958 నవంబర్‌ 13న రాజేశ్వరితో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. పెద్దవాడైన సురేష్‌బాబు చిత్ర నిర్మాణంలో ఉండగా, చిన్నవాడు వెంకటేష్‌ని 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు రామానాయుడు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లోనే వెంకటేష్‌తో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించారు. 1999లో తెలుగు దేశం పార్టీ తరఫున బాపట్ల లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రామానాయుడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అదే స్థానంలో ఓటమి పాలయ్యారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం రామానాయుడికి దాదా సాహెబ్‌ ఫాల్కే, 2012లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. వివిధ భాషల్లో నిర్మించిన సినిమాలకు జాతీయ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు అనేకం అందుకున్నారు రామానాయుడు.  2014 జనవరిలో జరిపిన వైద్య పరీక్షల్లో రామానాయుడుకు ప్రాస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత ఏడాది పాటు ఆ వ్యాధితో బాధపడిన ఆయన 2015 ఫిబ్రవరి 18న 78 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్ర సీమలో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న వారిలో రామానాయుడు ముందు వరసలో ఉంటారు. ఆయన ఎంతో మంది కొత్త నిర్మాతలకు ఆదర్శంగా నిలిచారు. చిత్ర పరిశ్రమలో ఎదగాలి అనే పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని రామానాయుడు సినీ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది.

‘ధూమ్‌4’ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేసిన ఎన్టీఆర్‌ డైరెక్టర్‌!

Publish Date:Jun 5, 2025

సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండాలి. అలాంటివి యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌లో ఫైట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అలా కాకుండా బైక్‌ ఛేజ్‌, కార్‌ ఛేజ్‌లతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా ‘ధూమ్‌’. యాక్షన్‌ మూవీస్‌లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన సినిమా ఇది. అభిషేక్‌ బచ్చన్‌, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంజయ్‌ గాధ్వీ దర్శకత్వం వహించారు. యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఈ అద్భుతమైన సిరీస్‌కి శ్రీకారం చుట్టింది. 11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై ఘనవిజయం సాధించి 72 కోట్లు కలెక్ట్‌ చేసింది. దీంతో వెంటనే దీనికి సీక్వెల్‌గా ‘ధూమ్‌2’ ప్రారంభించారు. సంజయ్‌ గాధ్వీ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. హృతిక్‌ రోషన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్‌ చేసింది.  ‘ధూమ్‌2’ భారీ విజయాన్ని నమోదు చేయడంతో పార్ట్‌ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎలా అప్‌డేట్‌ రాలేదు. ఒక దశలో సిరీస్‌ కొనసాగించే అవకాశం లేదనే వార్తలు కూడా వచ్చాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ‘ధూమ్‌3’ ప్రారంభించారు. ఆమిర్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ విలన్‌గా నటించడం విశేషం. మొదటి రెండు భాగాలకు రైటింగ్‌ సైడ్‌ పనిచేసిన విజయ్‌కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణం జరుపుకొని 2013లో విడుదలైన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే కమర్షియల్‌గా బాగానే వర్కవుట్‌ అయింది. 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 550 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ‘ధూమ్‌4’పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో సినిమా విడుదలై దాదాపు 12 సంవత్సరాలవుతోంది. కానీ, ‘ధూమ్‌4’ గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.  తాజాగా ‘ధూమ్‌4’కి సంబంధించిన ఒక న్యూస్‌ వైరల్‌గా మారింది. హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో ‘వార్‌2’ నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్న అయాన్‌ ముఖర్జీకి ధూమ్‌4ను డైరెక్ట్‌ చేసే బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. వాస్తవానికి అయాన్‌.. ‘వార్‌2’ పూర్తయిన వెంటనే ‘బ్రహ్మాస్త్ర2’ స్టార్ట్‌ చెయ్యాలి. అయితే ఈ సినిమాకి బడ్జెట్‌ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాలని నిర్మాత కరణ్‌ జోహర్‌ నిర్ణయించుకున్నారు. వార్‌2, ధూమ్‌ సిరీస్‌లను నిర్మించేది యష్‌ రాజ్‌ ఫిలింసే కాబట్టి పార్ట్‌ 4కి అయాన్‌ ముఖర్జీకి ఛాన్స్‌ ఇస్తున్నారు. ఇప్పటికే యానిమల్‌ చిత్రంతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రణబీర్‌ కపూర్‌.. ధూమ్‌ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే అయాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న వార్‌2పై మంచి బజ్‌ ఉంది. ఇప్పుడు ధూమ్‌4 వార్తల్లోకి రావడం, రణబీర్‌ కపూర్‌, అయాన్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా ఉంటుందని తెలియడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే రణబీర్‌ ప్రస్తుతం రామాయణం, లవ్‌ అండ్‌ వార్‌ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ధూమ్‌4 సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా స్టార్ట్‌ అవ్వడానికే చాలా కాలం పట్టేలా ఉంది. 

సార్ ఆ పబ్ అడ్రస్ ఇవ్వండి ఒకసారి...

Publish Date:Jun 6, 2025

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అమర్ దీప్ అమ్మాయిలు వేసుకునే చెప్పులు వేసుకొచ్చి సల్మాన్ ఖాన్ లా షర్ట్ తీసేసి దాన్ని అటు ఇటు తిప్పుతూ బెల్లి డాన్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో నిఖిల్ విజయేంద్ర సింహ మైక్ పట్టుకుని "ఎంత దిక్కుమాలిన దురదృష్టంలో ఉంటాడో ఈ మనిషి ఒకసారి జూబ్లీహిల్స్ లో ఒక పార్టీకి ఇలాగే షూటింగ్ జరుగుతోంది...ఇద్దరే ఉన్నారు అమరదీప్ ఇంకో అమ్మాయి." అంటూ ఏదో సీక్రెట్ రివీల్ చేయబోతుండగా అమరదీప్ కంగారు పడిపోయి "అమ్మో అది వర్క్ అది వర్క్" అని చెప్పి తప్పించుకోబోయాడు కానీ శ్రీముఖి ఊరుకోలేదు. "పెళ్ళికి ముందా. పెళ్లి తర్వాత" అని అడిగింది. "మొన్నమొన్న ఇది జరిగింది. కానీ అక్కడ ఉన్నది వీళ్ళ వైఫ్ కాదు " అని చెప్పాడు నిఖిల్. "బేసిక్ గా ఆ పిల్ల బిల్లు కట్టమంటే బెంచ్ కింద  బిల్ పడిపోయిందని చెప్తే వెతికి ఇచ్చాను" అని చెప్పాడు. దాంతో ఇమ్మానుయేల్  "ఆ బిడ్డకు కవర్ చేసుకోవడం కూడా రాదురా" అనేసరికి అందరూ నవ్వేశారు. తరువాత డెబ్జానీని శ్రీముఖి అడిగింది "అసలు పార్టీకి వెళ్లే ముఖమేనా మనది" అని అడిగింది. "హా వెళ్తాను. చాల మంది ఫ్రెండ్స్ ఉంటారు. 12 .30 వరకు మిడిల్ అంతవరకు ఒకే.. ఆ తర్వాత అందరికీ లవ్ యు అని చెప్తా 2 - 3 టైం గడిచాక నువ్వే నా సొంతం, నువ్వే నా జీవితం, నువ్వే అన్నీ అని చెప్తూ ఉంటా. నేను ఒక రకమైన ఫోజ్ పెదమనుకుంటా కానీ వాళ్ళు ఇంకో రకం ఫోజుల్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తారు" అని కామెడీగా చెప్పుకొచ్చింది. దాంతో అమరదీప్ ఐతే "సర్ ఆ పబ్ అడ్రెస్స్ ఇవ్వండి ఒకసారి" అని అడిగాడు.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

క్రేజీ కాంబో సెట్ చేసిన మైత్రి.. డైరెక్టర్ చెప్పిన స్టోరీకి హీరో ఫిదా..!

Publish Date:Jun 5, 2025

  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం పి. మహేష్ బాబు దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ నెక్స్ట్ మూవీ సైతం మైత్రి బ్యానర్ లోనే రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేసే అవకాశముందని సమాచారం.   'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు వినికిడి.    శివ నిర్వాణ ఓ మంచి కథని సిద్ధం చేశాడని, అది రామ్ కి సరిగ్గా సరిపోయేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే మైత్రి వీరిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసిందని, శివ చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ ఇంప్రెస్ అయ్యాడని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

థగ్ లైఫ్

Publish Date:Jun 5, 2025

భైరవం

Publish Date:May 30, 2025

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

Housefull 5

Publish Date:Jun 6, 2025

Thug Life

Publish Date:Jun 5, 2025

Bhairavam

Publish Date:May 30, 2025

Subham

Publish Date:May 9, 2025

Single

Publish Date:May 9, 2025