English | Telugu

సింగిల్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది

సింగిల్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది

శ్రీవిష్ణు (Sree vishnu), కేతిక శర్మ (ketika Sharma), ఇవానా (Ivana) కలయికలో తెరకెక్కిన మూవీ 'సింగిల్‌' (Single). మే 9న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపించిన సింగిల్‌ ని, గీతా ఆర్ట్స్, కల్యా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.

సింగిల్‌ మూవీ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. దీంతో ఓటిటి సినీ ప్రియులు నవ్వుల జడివానలో మునగనున్నారు. సింగిల్‌ గా ఉన్న విజయ్ తన జీవితానికి ఆడ తోడు కావాలని ఎంతో ఆశ పడుతుంటాడు. తన కోరిక ప్రకారం పూర్వ, హరిణి అనే ఇద్దరు అమ్మాయిలు విజయ్ ని ప్రేమిస్తారు. కానీ అర్ధం పర్థంలేని త్యాగాలతో వాళ్ళని దూరం చేసుకొని సింగిల్‌ గా మిలిగిలిపోతాడు. ఈ ప్రాసెస్ లో వచ్చే సన్నివేశాలతో పాటు విజయ్ నటన నవ్వులు పూయిస్తుంది. విజయ్ గా విష్ణు బాడీ లాంగ్వేజ్ తో  పాటు డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కర్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. 

మిగతా పాత్రల్లో చేసిన రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను కూడా తమ నటనతో మెప్పించారు. కార్తీక్ రాజు రచనా దర్శకత్వం వహించగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించాడు.