English | Telugu

సినిమా పేరు:శ్రీ శ్రీ శ్రీ రాజావారు
బ్యానర్:శ్రీ వేదాక్షర మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Jun 6, 2025

తారాగణం: నార్నే నితిన్, సంపద, నరేష్, రావు రమేష్,శుభలేఖ సుధాకర్, సరయు, అనంత ప్రభు, నెల్లూరు సుదర్శన్ తదితరులు
సంగీతం: కైలాస్ మీనన్ 
డీఓపీ: దాము నర్రావుల
ఎడిటర్: మధు
బ్యానర్: శ్రీ వేదాక్షర మూవీస్ 
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:వేగేశ్న సతీష్

 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithiin), శతమానం భవతి డైరెక్టర్ వేగేశ్న సతీష్ కాంబోలో తెరకెక్కిన శ్రీశ్రీశ్రీ రాజావారు (Sri Sri Sri Raajavaaru) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

 

కథ
పురిటిలోనే చనిపోయిన రాజా(నార్నే నితిన్) సిగరెట్ పొగ పీల్చడం వల్ల బతుకుతాడు. దీంతో కొంత వయసు వచ్చాక సిగరెట్ కి ఎడిక్ట్ అయ్యి విపరీతంగా తాగుతుంటాడు. అలా అని చెడ్డవాడేం కాదు. మంచి మనసుతో పాటు, అందరు బాగుండాలనే మెంటాలిటీని కలిగి ఉంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నిత్య (సంపద), రాజా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. రాజా తండ్రి సుబ్బరాజు(నరేష్), నిత్య తండ్రి కృష్ణమూర్తి (రావు రమేష్) స్నేహితులు. రాజకీయాల్లో ఉన్నత స్థానం కోసం ఇద్దరు పోటీ పడుతుంటారు. సిగరెట్ తాగే అలవాటు ఉందని కృషమూర్తి కి రాజా అంటే కోపం. కానీ నిత్యపై ఇష్టంతో పాటు రాజకీయాల్లో ఉన్నత స్థానం కోసం, రాజాతో నిత్య పెళ్ళికి  ఒప్పుకుంటాడు. కానీ ఎంగేజ్ మెంట్ లో రాజా చేసిన పనికి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత సుబ్బరాజు రాజకీయ జీవితానికి కూడా ఒక సవాలు ఎదురవుతుంది. ఎంగేజ్ మెంట్ లో రాజా చేసిన తప్పు ఏంటి? సుబ్బరాజుకి ఎదురైన సవాలు ఏంటి? ఆ సవాలుకి రాజా, సంపదల లవ్ కి సంబంధం ఉందా? రాజా సిగరెట్ అలవాటు ఏమైంది? చివరకి  రాజా, సంపద  ఒక్కటయ్యారా లేదా? అనేదే ఈ కథ.


ఎనాలసిస్ :

కథ లైన్ కొత్తగానే ఉన్నా ప్రస్తుత జనరేషన్ కి నచ్చేలా సీన్స్ ఉండాల్సింది. చాలా  సీన్స్  గతంలో చాలా సినిమాల్లో చూసిన వాటిలా ఉంటాయి. పైగా ఇలాంటి కథల్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా సిటీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తే బాగుంటుంది. కొడుకు సిగరెట్లపై సిగరెట్లు తాగుతుంటే తల్లితండ్రులు చెప్పకపోవడం వింతగా అనిపిస్తుంది. ఆ ఇద్దరితో పాటు రాజా చేత సిగరెట్ మానిపించడానికి ఫ్యామిలీ మెంబర్స్, నిత్య ప్రయత్నించడంలో కామెడీని సృష్టించాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పుట్టగానే చనిపోయిన పిల్లాడు సిగరెట్ పొగ పీల్చడంతో లేస్తాడు. అలాంటప్పుడు అతను చిన్న వయసు నుంచే సిగరెట్ తాగడం అనేది చూపించకుండా, పదహారు సంవత్సరాల వయసులో అలవాటు చేసుకోవడం చూపించారు. రాజా, నిత్య పై వచ్చిన లవ్ సీన్స్, రాజాతో వచ్చే ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. రాజా, నిత్య ప్రేమ మధ్యలోకి రాజకీయాలు ఎంటర్ అవ్వడంతో, వాళ్లిదరి ప్రేమ ఏమవుతుందో అనే ఆసక్తి కలిగింది. కానీ నిత్య తండ్రి తన రాజకీయ స్వార్ధం కోసం పెళ్ళికి ఒప్పుకోవడంతో సినిమా అయిపోయింది కదా అనిపిస్తుంది. కానీ కృష్ణమూర్తి, సుబ్బరాజు ఒకే కుటుంబంగా మారకూడదని ఎంఎల్ఏ నిర్ణయించుకోవడంతో కథలో మంచి ట్విస్ట్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో ఈ విషయంపైనే కథ నడుస్తూ, రాజా సిగరెట్ అలవాటుకి, నిత్య ప్రేమ కి  లింక్ పెట్టి ఉంటే సినిమాకి సరికొత్త లుక్ వచ్చి ఉండేది. కానీ ఆ దిశగా వెళ్లకుండా రాజాకి ఉన్న సిగరెట్ అలవాటు పైనే వెళ్లారు. క్లైమాక్స్ వర్క్ అవుట్ కాలేదు.

 

నటీనటులు, సాంకేతిక నిపుణులపనితీరు
రాజా క్యారక్టర్ లో నార్నే నితిన్ సూపర్ గా పెర్ఫార్మ్ చేసాడు. లవ్, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లో ఎంతో అనుభవం ఉన్న హీరోగా చేసాడు. హీరోయిన్ సంపద కూడా నిత్య క్యారక్టర్ లో మంచి నటననే ప్రదర్శించింది. మిగతా క్యారక్టర్ లలో చేసిన నరేష్, రావు రమేష్, శుభలేఖ సుధాకర్ తో పాటు అందరు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో పెద్దగా మెరుపులు లేకపోయినా, కథకి ఉన్న స్కోప్ ప్రకారం బాగానే తెరకెక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు పర్లేదు. డైలాగ్స్ అంతగా క్లిక్ అవ్వ్వలేదు. ఫొటోగ్రఫీ బాగానే ఉన్నా నిర్మాణ విలువలు మాత్రం సో సో.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథ కొత్తగానే అనిపించినా, సన్నివేశాలు మాత్రం చాలా సినిమాల్లో చూసినట్టుగా ఉండటం శ్రీశ్రీశ్రీ రాజావారికి మైనస్. నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది.

- అరుణాచలం

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' doiscretion is advised.