English | Telugu

రేణు మనసును దోచిన చిలుక!

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్..  "జానీ" మూవీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు. తన కొడుకు, కూతురితో చాలా హ్యాపీగా ఉంటోంది రేణు దేశాయ్. అలాంటి రేణు సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇకపోతే  రేణుకి పక్షులంటే ఎంతో ఇష్టం. రీసెంట్ గా ఆమె ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ జరిగింది మొత్తాన్ని వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రంగురంగుల చిలక ఒకటి రేణు దేశాయ్ ప్లేట్ లో ఉన్న బాదం పప్పుల్ని తింటూ కనిపించింది. అది అలా తింటుంటే రేణు ముఖంలో ఎంతో సంతోషంతో వెలిగిపోయింది. " ఈ క్యూట్ చిలుక  మీ ప్లేట్ లోంచి కూడా  ఇలాగే బాదంపప్పులు దొంగతనం చేస్తే చూడాలని ఉంటే గనక వెంటనే మీరు మైరు కేఫ్ కి వచ్చేయండి..నా మనసును దోచుకుంది ఈ చిలుక" అని చెప్పింది.

'పుష్ప-2' నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపికే. పుష్పగా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టెర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సన్సేషన్ కాంబోలో రాబోతున్న పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వేర్‌ ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు, ఐకాన్‌ స్టార్ లుక్‌కు వచ్చిన అనూహ్యమైన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.