English | Telugu

మళ్ళీ తెరపైకి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. అసలు మానవత్వం ఉందా వీళ్ళకి

ప్రముఖ బాలీవుడ్ హీరో 'సైఫ్ అలీ ఖాన్'(saif Ali Khan)పై ఈ ఏడాది జనవరిలో ముంబై లోని తన ఇంట్లో జరిగిన దాడి ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. బంగ్లాదేశ్ కి చెందిన మహమ్మద్ షరీఫ్ షెహజాద్ అనే వ్యక్తి ఈ దాడికి ప్రధాన సూత్ర దారి. దాడి జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ భార్య ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor)క్యారక్టర్ గురించి సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వచ్చాయి. వాటిపై కరీనా ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.

కానీ రీసెంట్ గా తనపై వచ్చిన కామెంట్స్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'చెత్త లాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు కోపం రాకుండా బాధ వేసింది. సాటి మనిషిపై చూపించే మానవత్వం ఇదేనా!. ఇలాంటి తప్పుడు ప్రచారాలనే మనుషులు కోరుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారా!. ఇతరుల బాధలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారా! మనమెంతో గొప్పగా భావించే డిజిటల్ యుగం అంటే ఇదేనా! అని అనిపించింది.

నా కొడుకు గదిలోకి ఆగంతుకుడు చొరబడిన సంఘటన గురించి ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. దాడి జరిగిన కొన్ని నెలలు నిద్ర పోలేదు. ఇప్పటికి ఆ సంఘటన తలచుకుంటూ భయపడుతున్నానని చెప్పుకొచ్చింది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కి 2012 లో వివాహం అయ్యింది. వారిరువురికి ఇద్దరు మగ పిల్లలు.