English | Telugu

బంగారం లాంటి వార్త.. రాజ్ తో కలిసి సమంత రెండో అడుగు..!

- సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- రెండో అడుగు వేసిన సమంత

సమంత (Samantha) అభిమానులకు బంగారం లాంటి వార్త. తాజాగా ఆమె తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో రెండో అడుగు వేసింది. ఇంతకీ ఆ వార్త ఏంటి? ఆమె రెండో అడుగు దేనికోసం?

నటిగా తిరుగులేని గుర్తింపు పొందిన సమంత, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌ నుండి మొదటి సినిమాగా వచ్చిన 'శుభం' విజయం సాధించింది. ఇప్పుడు రెండో సినిమాకి అడుగు పడింది.

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా 'మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram) సినిమాను ప్రారంభించారు. 'ఓ బేబి' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సమంత‌, డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఇందులో స‌మంత‌, దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Also Read: చిరంజీవి ఫేక్ వీడియోలు.. సజ్జనార్ మాస్ వార్నింగ్..!

ఈ చిత్రానికి స‌మంత‌, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాత‌లు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సీతా మీన‌న్, వ‌సంత్ మరిన్‌గంటి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా ప‌ల్ల‌వి సింగ్, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ గా ఉల్లాస్ హైద‌ర్, ఎడిట‌ర్‌గా ధ‌ర్మేంద్ర కాక‌రాల వ‌ర్క్‌ చేస్తున్నారు.

సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో 'మా ఇంటి బంగారం' సినిమా తాజాగా ప్రారంభ‌మైంది. మూవీ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే గ్రిప్పింగ్ యాక్ష‌న్ డ్రామా అనిపించింది. అద్భుత‌మైన యాక్ష‌న్ బ్యాంగ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌ని ఈ సందర్భంగా మేక‌ర్స్ తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభ‌మైందని, మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలో తెలియజేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.