English | Telugu

The Great Pre-Wedding Show Review: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ 

సినిమా పేరు: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
తారాగణం: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని, మాస్టర్ రోషన్ తదితరులు
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: నరేష్ అడపా
రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: సోమశేఖర్
బ్యానర్స్ : పప్పెట్ షో ప్రొడక్షన్, 7పీఎం ప్రొడక్షన్
నిర్మాత: సందీప్ అగరం
విడుదల తేదీ: నవంబర్ 7 2025


తిరువీర్, టీనా శ్రావ్య జంటగా చేసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The great pre wedding show)థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ 'వెడ్డింగ్ షో' పై తమ ఫోకస్ ని ఉంచారు. సినిమాపై నమ్మకంతో రిలీజ్ కి రెండు రోజుల ముందే మేకర్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

రమేష్ (తిరువీర్) శ్రీకాకుళంలోని ఒక రూరల్ విలేజ్ లో చిన్నసైజు ఫోటో స్టూడియోతో పాటు జిరాక్స్ సెంటర్ నడుపుతుంటాడు. మొహమాటం,బిడియం,భయం రమేష్ లో పోటాపోటీగా ఉంటాయి. తన షాప్ ఎదురు పంచాయితీ ఆఫీస్ లో పని చేసే హేమ(టీనా శ్రావ్య) అంటే రమేష్ కి చాలా ఇష్టం. మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన హేమకి కూడా రమేష్ అంటే ఇష్టం. కళ్లతోనే ప్రేమించుకుంటు ఉంటారు. కానీ ఒకరికొకరు ఆ విషయాన్నీచెప్పుకోరు. ఆనంద్( నరేంద్ర రవి) చిన్నసైజు పొలిటికల్ లీడర్ తో పాటు మండల పరిషత్ అధ్యక్షుడికి కుడి భుజం. సౌందర్య( యామిని) తో ఆనంద్ కి పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడతారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకోవాలని రమేష్ ని సంప్రదిస్తారు. రమేష్ మాత్రం ఆ ఇద్దరి పెళ్లి చెడకొట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఆనంద్ ని, నీప్రేమలో పడేలా చెయ్యమని హేమని కోరతాడు.హేమ కూడా ఒప్పుకుంటుంది. రమేష్ ఎందుకు ఆనంద్, సౌందర్యల పెళ్లి చెడగొట్టాలని అనుకున్నాడు? అందుకు కారణం ఏంటి? హేమని ఉపయోగించుకొని పెళ్లి చెడగొట్టడంలో సక్సెస్ అయ్యాడా ? అసలు ప్రీ వెడ్డింగ్ వీడియో తీసాడా? రమేష్,హేమ ప్రేమ ఏమైంది? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఏమైంది? అనేదే చిత్ర కథ


ఎనాలసిస్

ముమ్మాటికీ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిన్న సినిమాని తెరకెక్కించాలనుకునే వాళ్లకి ఇన్ స్పైర్ ఇస్తుందని చెప్పవచ్చు. చిత్ర కథ కూడా చాలా నేచురల్ గా ఉంది. కానీ కథనాల విషయంలో మరింత లోతుగా వెళ్ళలేదు. ఆ అవకాశం ఉన్నా కూడా మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు. తూ తూ మంత్రంగా డైలాగ్స్ తో ముగించేశారు. కాకపోతే మూవీ అయితే బోర్ అనేది రాదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రమేష్,హేమ మధ్య వచ్చిన సన్నివేశాలతో పాటు, అసిస్టెంట్ రోషన్ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆనంద్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ బాగుంది. ఆనంద్, సౌందర్య తో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ సన్నివేశాలు కూడా సూపర్ గా వచ్చి నవ్వులని పూయిస్తాయి. ప్రీ వెడ్డింగ్ లో జరిగిన ఒక మిస్టేక్ తో ఆ ఇద్దరి పెళ్లిని రమేష్ ఆపాలని అనుకోవడం బాగుంది.

కానీ అందుకు సంబంధించిన ప్రయత్నాలు సినిమా టిక్ గా లేవు. డాక్యుమెంటరీ సీన్స్ లాగా సాగాయి. ఆనంద్ ని ప్రేమలోకి దించమని హేమకి చెప్పాడు కాబట్టి, హేమ ప్రేమలోకి ఆనంద్ నిదానంగా వస్తున్నాడని చెప్పి ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కన్ఫ్యుస్ డ్రామాని క్రియేట్ చెయ్యాల్సింది. ఆ విధంగా చేసుంటే సరికొత్త లుక్ వచ్చి ఉండేది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు మిగతా ట్విస్ట్ ల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు.

రమేష్ లో ఉన్న మంచి తనాన్ని, అమాయకత్వాన్ని,భయాన్ని కొన్ని సీన్స్ ద్వారా చెప్పుండాల్సింది. ఆ విధంగా చేసి ఉంటే రమేష్ అనుకున్న నిర్ణయానికి మరింత జస్టిఫై వచ్చి ఉండేది. సెకండ్ హాఫ్ లో అయినా కథనం విషయంలో మరింత లోతుగా వెళ్తారేమో అనుకుంటాం. కానీ సాదా సీదాగానే ముగించేశారు. రమేష్, హేమ ల లవ్ ని ఎస్టాబ్లిష్ చెయ్యడంతో పాటు, ఆనంద్ ఫ్యామిలీ మధ్య ఎంటర్ టైన్ మెంట్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాలిసింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు


రమేష్ క్యారక్టర్ లో 'తిరువీర్'(Thiruveer)పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. సదరు క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసాడు. కాకపోతే నటనలో భిన్న పార్శ్యాలని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. హేమ క్యారక్టర్ లో టీనా శ్రావ్య(Teena Sravya)తన పాత్ర పరిధి మేరకు ఎక్కువ డోస్ లేకుండా ఎంత వరకు పెర్ ఫార్మ్ ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించింది. నరేంద్ర రవి, యామిని కూడా తమ నటనతో మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా నరేంద్ర రవి అయితే శ్రీకాకుళం ప్రాంతంలోని ప్రజల్లో ఉండే కల్లా కపటం లేని మంచితనం, అమాయకత్వం, చిరు కోపాన్ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు.

రమేష్ అసిస్టెంట్ గా చేసిన మాస్టర్ రోషన్ మరోసారి విజృంభించాడు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్గగా చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ పరంగా చూసుకుంటే ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీకాకుళం ఏరియాకి చెందిన ప్రకృతి అందాలని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. రాహుల్ శ్రీనివాస్(Rahul Srinivas)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా పెద్దగా మెప్పించలేక పోయాడు. నిర్మాణ విలువలు అంతగా బాగోలేదు.

ఫైనల్ గా చెప్పాలంటే నటీనటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కథనం సాగింది.

రేటింగ్ 2 .75 /5

అరుణాచలం

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.