English | Telugu

సుమకి ప్రొపోజ్ చేసిన జానీ మాస్టర్

సుమ సుదీర్ఘ కాలం పాటు చేసిన క్యాష్ షో ప్లేస్ లోకి ఇప్పుడు "సుమ అడ్డా" అనే సరికొత్త షో స్టార్ట్ అయ్యింది. ప్రతీవారం ఈ షోకి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకి రావడంతో మంచి  రేటింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ షో. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గెస్ట్స్ గా వచ్చారు.  ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఈ డాన్స్ మాస్టర్స్ ఇద్దరూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు.  ముఖ్యంగా వీరిద్దరి మీద సుమ వేసిన పంచులు వేరే లెవెల్.  శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని కూడా స్క్రీన్ పై వేసి చూపించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది.