English | Telugu

సుమకి ప్రొపోజ్ చేసిన జానీ మాస్టర్

సుమ సుదీర్ఘ కాలం పాటు చేసిన క్యాష్ షో ప్లేస్ లోకి ఇప్పుడు "సుమ అడ్డా" అనే సరికొత్త షో స్టార్ట్ అయ్యింది. ప్రతీవారం ఈ షోకి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకి రావడంతో మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ షో. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గెస్ట్స్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఈ డాన్స్ మాస్టర్స్ ఇద్దరూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వీరిద్దరి మీద సుమ వేసిన పంచులు వేరే లెవెల్. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని కూడా స్క్రీన్ పై వేసి చూపించి ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

ఇక ఈ షోలో ప్రేమదేశం మూవీ సీన్స్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఈ స్పూఫ్ లో భాగంగా మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి అని సుమ అడిగేసరికి జానీ మాస్టర్ పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగేసరికి సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. జానీ మాస్టర్ మాటలు స్టేజి మొత్తం కూడా ఈలలు కేకలే...ఇలా ఈ ఎపిసోడ్ ఫన్నీగా ఎంటర్టైన్ చేయబోతోంది. సుమ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వున్న యాంకర్. ఎంత మంది గ్లామరస్ యాంకర్స్ వచ్చినా సుమతో పోటీకి మాత్రం దిగలేకపోతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.