English | Telugu
హైపర్ ఆది మీద మంత్రి రోజా కామెంట్స్ వైరల్...భయపెట్టి మాట్లాడిస్తున్నారు
Updated : Jan 18, 2023
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంత్రి రోజా, జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిన విషయమే. ఇక మధ్యలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ గురించి కూడా తెలిసిందే. మరో వైపు పవన్ పై కౌంటర్స్ వేస్తూనే కమెడియన్ ఆది మాటలపై కూడా స్పందించారు.
‘హైపర్ ఆది చిన్న ఆర్టిస్టు. అలా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో ఉండనివారు అనే భయం. ఇంకా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్దది. ఆ ఫ్యామిలీతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో.. వెనుక నుంచి వెకిలిగా మాట్లాడిస్తున్నారు. ఇలా భయంతో ఎక్కువ కాలం బతకలేరు. మంత్రులకు శాఖలు తెలియవు అంటే కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, శారద, నేను ఎలా గెలిచాం. మేమూ సినిమా వాళ్ళమే కదా ! మరి ప్రజలు మమ్మల్ని గెలిపించారు మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు ? ఎవరు ఎలాంటివారో జనాలకు తెలుసు.ఈ రాష్ట్ర ప్రజలకు అందరి గురించి తెలుసు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మైండ్ లోనూ, మనసులో ఉండాలి.. ” అని చెప్పుకొచ్చారు రోజా ఒక ఇంటర్వ్యూలో.