English | Telugu
‘ఎలా చెప్పాలో తెలియట్లేదు’ అంటున్న దీప్తి సునైనా
Updated : Jan 18, 2023
దీప్తి సునైనా యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కూడా. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాకా మంచి ఆఫర్స్ నే అందుకుంది. ఈమె యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అప్పట్లో లవర్స్ అన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఫుల్ పాపులర్ అయ్యారు. తర్వాత కొంత కాలానికి దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి సింగల్ గా ఉంటోంది. మధ్యలో కొంతకాలం గ్యాప్ తీసుకుని తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు 'ఏమోనే' అనే సాంగ్ చేసింది. సోషల్ మీడియా వల్ల తక్కువ టైములో ఎక్కువ పాపులర్ అయ్యింది దీప్తి సునైనా.. కెరీర్ పరంగా ఏమంత బిజీగా లేకపోయినా..జిమ్ లో వర్కౌట్స్ తో ఎప్పుడు లైం లైట్ లో ఉంటూనే ఉంటుంది.
అలాగే తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ కొన్ని ఇంటరెస్టింగ్ లైన్స్ ని పోస్ట్ చేసింది. "గైస్.. ఎలా చెప్పాలో తెలియట్లేదు' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడ్డారు. తన మరో పోస్టులో 'ఏమోనే సాంగ్ టైంకి అప్‌లోడ్ చేస్తే పర్లేదు కదా ? తిట్టుకుంటున్నందుకు థ్యాంక్స్' అంటూ ఒక కామెడీ ట్విస్ట్ ఇచ్చింది. ఇలా దీప్తి కాసేపు సందడి చేసింది.