English | Telugu

"ఇంకేం ఇంకేం కావాలే|".. ఐదేళ్ళ 'గీత గోవిందం'.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ మరచిపోవడం సాధ్యమా!?

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'గీత గోవిందం'.. బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరీముఖ్యంగా.. వీరిద్దరి మధ్య వచ్చే ముద్దు సీన్ అయితే హాట్ టాపిక్ గా నిలిచింది. నిత్యా మీనన్, అను ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్రల్లో మెరిసిన 'గీత గోవిందం'లో సుబ్బరాజు, నాగబాబు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, గిరిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 

ఎన్టీఆర్ 'మంచి మనసుకు మంచి రోజులు'కి 65 ఏళ్ళు.. ఆ పాపులర్ పాటని చిరంజీవి హిట్ మూవీలో భలే వాడారు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో పలు రీమేక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో 'మంచి మనసుకు మంచి రోజులు' ఒకటి. తమిళ చిత్రం 'తాయ్ పిరందాళ్ వళి పిరక్కుమ్' (ఎస్. ఎస్. రాజేంద్రన్, ఎం.ఎన్. రాజమ్, ప్రేమ్ నజీర్, రాజసులోచన) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజసులోచన, రాజనాల, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణ మూర్తి, పేకేటి శివరామ్, సూర్యకాంతం, గిరిజ, జయశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, టి. అశ్వద్ధ నారాయణ నిర్మించారు. ఏకే వేలన్ కథకి సముద్రాల జూనియర్ సంభాషణలు సమకూర్చారు. 

పాతికేళ్ళ 'శ్రీరాములయ్య'.. ప్రారంభోత్సవంలో 'కారుబాంబు' దాడి!

వెండితెరపైకి వచ్చాక సంచలనం సృష్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రారంభోత్సవం నుంచే వార్తల్లో నిలిచిన చిత్రాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో.. 'శ్రీరాములయ్య' ఒకటి. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించగా.. తనకి జంటగా అభినేత్రి సౌందర్య కనిపించారు. కామ్రేడ్ సత్యంగా నందమూరి హరికృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీహరి కీలక పాత్రలో అలరించారు. 'ఎన్ కౌంటర్' ఫేమ్ ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరిటాల సునీత నిర్మించారు.

అతిలోక సుందరి ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన 9 సినిమాలు. ఆ చిత్రాలేంటో తెలుసా!?

వెండితెరపై తిరుగులేని తారగా రాణించిన వైనం.. అతిలోక సుందరి శ్రీదేవి సొంతం. ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ తనదైన అభినయంతో మురిపించారీ ఆల్ ఇండియా సూపర్ స్టార్. బాలనటిగా కెరీర్ ని ఆరంభించి ఆనక అగ్ర కథానాయికగా శ్రీదేవి ఎదిగిన తీరు.. ఎందరో తరువాతి తరాల తారలకు మార్గదర్శకంగా నిలిచిందంటే అభినేత్రిగా ఆమె స్థాయి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు గ్లామర్ వేషాలతో కట్టిపడేసిన శ్రీదేవి.. మరోవైపు అభినయానికి ఆస్కారమున్న భూమికల్లోనూ భలేగా మెప్పించారు. ఇక డబుల్ రోల్స్ లో అయితే శ్రీదేవి అదరహో అనిపించారనే చెప్పాలి.