English | Telugu

"ఇంకేం ఇంకేం కావాలే|".. ఐదేళ్ళ 'గీత గోవిందం'.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ మరచిపోవడం సాధ్యమా!?

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'గీత గోవిందం'.. బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరీముఖ్యంగా.. వీరిద్దరి మధ్య వచ్చే ముద్దు సీన్ అయితే హాట్ టాపిక్ గా నిలిచింది. నిత్యా మీనన్, అను ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్రల్లో మెరిసిన 'గీత గోవిందం'లో సుబ్బరాజు, నాగబాబు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, గిరిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.

గోపీసుందర్ సంగీతమందించిన 'గీత గోవిందం'లో "ఇంకేం ఇంకేం కావాలే" అంటూ సాగే గీతం బాగా పాపులర్ కాగా.. "ఏంటి ఏంటి", "వచ్చిందమ్మా", "కనురెప్ప కాలం", "తనేమందే తనేమందే", "వాట్ ద లైఫ్" అంటూ మొదలయ్యే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన 'గీత గోవిందం'.. 2018 ఆగస్టు 15న విడుదలై అఖండ విజయం సాధించింది. మంగళవారంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 5 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.