English | Telugu
రాంచరణ్ తండ్రి కోసం వేట
Updated : Mar 28, 2014
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో చరణ్ కు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై జగపతి స్పందిస్తూ... "ఆ పాత్ర కోసం కృష్ణవంశీ తనని సంప్రదించిన మాట నిజమే కానీ, తాను సున్నితంగా తిరస్కరించాను అని అన్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. వంశీ చెప్పినటువంటి ఆఫర్స్ కూడా బోలెడన్ని వస్తున్నాయి అని అన్నారు. నటుడు శ్రీహరి చనిపోయిన తర్వాత ఆ స్థానంలో సరైన నటుడి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకు తాను మరో అవకాశంగా మారాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.