English | Telugu

ఈసారి సంపూ కొబ్బరిమట్ట

"హృదయ కాలేయం" అనే టైటిల్ పెట్టి, టాలీవుడ్ లో సంపూ అంటే తెలియనివారు లేరనే విధంగా ప్రచారం చేసి, తన సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూసే విధంగా చేసుకున్న సంపూర్నేష్ బాబు మరోసారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. "హృదయ కాలేయం" ను తెరకెక్కించిన దర్శకుడు స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూ తన రెండవ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి "కొబ్బరిమట్ట" అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో సంపూ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అలాగే సంపూ "హృదయ కాలేయం" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.