English | Telugu
నటి హేమ పార్టీ పెడుతోందా?
Updated : Mar 18, 2015
హేమ తెలుసుగా మీకు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అందరిపైనా సెటైర్లు వేస్తుంది. హీరోల్ని, హీరోయిల్ని, డైరెక్టర్లనీ ఎవ్వరినీ వదలను. కానీ ఆమెతో మాత్రమే ఎవ్వరూ పెట్టుకోరు. ఎందుకొచ్చిన గొడవరా బాబూ.. అంటూ తప్పుకొంటారు. కానీ ఆమెపైనే సెటైర్ వేశాడు ఆర్.నారాయణ మూర్తి. రేయ్ ఫంక్షన్‌కి నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా వచ్చాడు. అక్కడే హేమ ఉంది. మైకు పట్టుకొని నారాయణ మూర్తి మాట్లాడుతోంటే పడీ పడీ నవ్వుతోంది. అందుకే మూర్తిగారూ.. ఆమెపై సెటైర్ వేసేశారు. ''హేమమ్మ చూడ్డానికి అలా కనిపిస్తుంది గానీ, మంచి పొలిటీషియన్ అవుతుంది...చూస్తుండండి. రేపో మాపో పార్టీ పెడుతుంది. ముఖ్యమంత్రి కూడా అవుతుంది. హేమమ్మా... పార్టీ పెట్టు.. కానీ పార్టీలు మారకు...'' అంటూ సెటైర్ వేసేశాడు. గత ఎన్నికల్లో హేమ కిరణ్ పార్టీ తరపున ప్రచారం చేసింది. మండపేటలో నిలబడి ఓడిపోయింది. నిజంగానేఇప్పుడు మూర్తిగారి మాటల్ని నిజం చేయడానికైనా పార్టీ పెడుతుందేమో చూడాలి.