English | Telugu
మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ....
హిందీలో సూపర్ హిట్టయిన "కౌన్ బనేగా కరోడ్ పతి" కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి "మీలో కోటీశ్వరులు ఎవరు" అనే టైటిల్ ఖరారు చేసారు.
దాదాపు చాలా చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి నటించిన నటి హేమ అందరికి సుపరిచితురాలే. ఎప్పుడూ కూడా ఎదో ఒక గోల చేస్తూనే ఉండే ఈ అమ్మడు త్వరలోనే సినిమాలకు స్వస్తి పలకడానికి సిద్ధమవుతుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
మహేష్ తో కలిసి "1నేనొక్కడినే" చిత్రంలో నటించిన బ్యూటీ కృతిసనన్ కు ఇప్పటివరకు మరో సినిమాలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ సినిమా విడుదలై కృతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది.అయితే తాజాగా ఈ అమ్మడికి రెండు భారీ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు తెలిసింది.
రాంచరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో "గోవిందుడు అందరివాడేలే" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
వెంకటేష్ హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతుందనుకున్న "రాధా" చివరకు అటకెక్కి కూర్చుంది. ఈ సినిమా కథపై వచ్చిన వివాదం ఇంకా పూర్తికాలేదు.
రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "విక్రమ సింహ". తమిళంలో "కొచ్చడయన్". దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించింది.
ఇప్పటివరకు హీరోగా మాత్రమే నటించిన జగపతిబాబు తొలిసారిగా "లెజెండ్" సినిమాలో జితేంద్ర గా విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతి నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాలకృష్ణ హీరోయిజానికి జగపతి విలన్ పాత్రలో అదరగొట్టాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్స్ హక్కులు దాదాపు 6కోట్ల వరకు అమ్ముడు పోయాయని తెలిసింది.
"హార్ట్ ఎటాక్" చిత్రం ఘనవిజయంతో ఫుల్ జోష్ లో ఉన్న పూరీ.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తున్నాడు.
పోసాని కృష్ణమురళీ నటించిన "బ్రోకర్2" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఇందులో దాసరి మళ్లీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వంలో "బ్రోకర్" అనే చిత్రం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ "బ్రోకర్ 2" తెరకెక్కుతుంది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర మరో పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది.
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.