Read more!

English | Telugu

వేశ్య పాత్రలో పోటుగాడి లవర్

 

మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ కూడా ఈ అమ్మడికి మాత్రం సరైన అవకాశాలు రావట్లేదు. అయితే ఇటీవలే ఈ అమ్మడికి ఒక సినిమాలో అవకాశం వచ్చిందట. అందులో వేశ్య పాత్ర. వేశ్య పాత్ర కోసం సాక్షిని సంప్రదించగానే వెంటనే ఒప్పేసుకుందట. ఈ పాత్రలో గ్లామర్ తో పిచ్చేక్కించాలి అనే కండిషన్లకు సైతం అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. అసలే రాక రాక ఒక్క ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకుంటుందా చెప్పండి! ఇక ఈ అమ్మడు నటించబోయే సినిమాలో సాక్షి గ్లామర్ ను బాగా వాడుకోవాలని ఆ చిత్ర దర్శక,నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. మరి ఈ సినిమా సాక్షికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.