English | Telugu

అందంగా కనపడటానికి మాధవన్ ఏం వాడతాడో తెలిసిపోయింది

అందంగా కనపడటానికి మాధవన్ ఏం వాడతాడో తెలిసిపోయింది

మూడు దశాబ్దాల నుంచి పాన్ ఇండియా నటుడుగా అనేక హిట్ చిత్రాల్లో నటిస్తు తన సత్తా చాటుతు వస్తున్న నటుడు మాధవన్(Madhavan). సఖి, చెలి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్న 'మాధవన్' జులై 11 న 'ఆప్ జైసా కోయి'(Aap jaisa Koi) అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో మాధవన్ మాట్లాడుతు చాలా మంది నేను యంగ్ గా కనపడటానికి ఏమైనా మెటీరియల్స్ వాడతారేమో అని అనుకుంటారు. నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సినిమాలో కూడా ఎలాంటి టూల్స్ వాడలేదు. గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం డైటీషియన్స్ ని సంప్రదించాను. బరువు తగ్గడం, ఫిట్ గా కనిపించడం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తినాలో చెప్పారు. అప్పట్నుంచి ఆ సలహాలు పాటిస్తున్నాని చెప్పుకొచ్చాడు.

మాధవన్ సరసన దంగల్ ఫేమ్  'ఫాతిమా సనా షేక్'(Fatima Sana Shaikh)జోడిగా చేసిన 'ఆప్ జైసా కోయి' కి కరణ్ జోహార్(karan Johar)నిర్మాతగా వ్యవహరించాడు. వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

 

 

  

అందంగా కనపడటానికి మాధవన్ ఏం వాడతాడో తెలిసిపోయింది