English | Telugu
కన్నప్ప క్యారెక్టర్ లో ఎవరు గెలిచారో అర్థమైపోయింది!
Updated : Jun 27, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)చాలా రోజుల తర్వాత ఈ రోజు మైథలాజికల్, డెవోషనల్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. 'తిన్నడు' అనే నాస్తికుడు, ఆ తర్వాత శ్రీ కాళహస్తీశ్వరుడికి భక్తుడిగా మారి తన రెండు కళ్ళు సమర్పిస్తాడు.ఈ అపర భక్తుడికి సంబంధించిన నిజ జీవిత కథతో కన్నప్ప తెరకెక్కింది. విష్ణు ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కన్నప్ప పై ఎంతో ఆసక్తి ఏర్పడింది. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు 'భక్త కన్నప్ప' మూవీలో 'కన్నప్ప' గా కనపడి ప్రేక్షకుల్లో సదరు క్యారక్టర్ పై చెరగని ముద్ర వేసాడు. దీంతో కృష్ణం రాజు లాగా విష్ణు మెప్పించగలడా అనే సందేహాలు చాలా మందిలో తలెత్తాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో విష్ణుని 'కన్నప్ప' గా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి.
ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటికి విష్ణు తనదైన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టాడు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు 'కన్నప్ప' గా విష్ణు సూపర్ పెర్ఫార్మ్ చేసాడనే మాటలు వినపడుతున్నాయి. గతంలో కృష్ణంరాజు లాగా అడవి జాతికి సంబంధించిన తెగలో ఉండే అమాయకత్వం, ఆపద వచ్చినప్పుడు పోరాడే ధీరత్వం, దేవుడి పేరుతో మూర్కత్వపు ఆలోచన చేసి అమాయకుల్ని చంపేటప్పుడు ప్రశ్నించే విధానం, నమ్ముకొని వచ్చిన ప్రేయసి మీద ఉన్న తన ప్రేమని వ్యక్త పరచడం, ఇలా అన్నింటిలోను కృష్ణంరాజుని విష్ణు మరిపించాడని అంటున్నారు. ముఖ్యంగా శివుని పై తనకెంత ప్రేమ ఉందో తెలుపుతూ చెప్పే సీన్ లో గాని, శివుడి కళ్ళ నుంచి రక్తం కారుతుంటే, కళ్ళకి ఏమైందని బాధపడుతు పసి పిల్లవాడిని అడిగినట్టుగా శివుడ్ని అడగటం, ఆ తర్వాత తన కళ్ళని సమర్పించే సీన్ లో విష్ణు నటన కన్నీళ్లు తెప్పించిందని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్తున్నారు. కృష్ణంరాజు కూడా ఆ సీన్ లో అద్భుతంగా నటించి కన్నీళ్లు తెప్పించాడని అందరు మరో సారి గుర్తు చేసుకుంటున్నారు. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అనే మూవీలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా కన్నప్ప పాత్రలో అద్భుతంగా చేసాడు.
ఇక విష్ణు కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా 'కన్నప్ప' కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకే షోస్ పడ్డాయి. మొదటి షో నుంచే హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రభాస్(Prabhas) మోహన్ లాల్(MOhan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar)శరత్ కుమార్(Sarath Kumar)కాజల్, ప్రీతీ ముకుందన్ ఇలా తదితరులందరు సినిమా విజయంలో భాగస్వామ్యమయ్యారు. ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar)దర్శకత్వం వహించగా స్టీఫెన్ దేవసి సంగీతాన్ని అందించాడు.'కన్నప్ప'కి విష్ణు కథ, స్క్రీన్ ప్లే ని అందించగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
