English | Telugu

నితిన్ ప్లేస్ లో ఆ హీరో!.. ఇక మొత్తం పవర్ లోనే ఉంది !

నితిన్(Nithiin)గత నెలలో 'తమ్ముడు'(Thammudu)తో వచ్చి మరోసారి తన అభిమానులని,ప్రేక్షకులని నిరాశపరిచాడు. నితిన్ గతంలో ఒప్పుకున్న చిత్రాల్లో 'పవర్ పేట' అనే మూవీ కూడా ఒకటి. నితిన్ తోనే 'చల్ మోహన్ రంగ' అనే చిత్రాన్ని తెరకెక్కించిన 'కృష్ణ చైతన్య(krishna Chaitanya)దర్శకుడు'. కొన్ని కారణాల వల్ల 'పవర్ పేట' సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది. కృష్ణ చైతన్య ఆ తర్వాత 'విశ్వక్ సేన్' తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని' తెరకెక్కించాడు.

ఇప్పుడు 'పవర్ పేట' చిత్రాన్ని 'సందీప్ కిషన్'(Sundeep Kishan)తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కృష్ణ చైతన్య స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసాడని, అగస్ట్ 9 న పూజా కార్యక్రమాలతో 'పవర్ పేట' ప్రారంభం కావచ్చనే టాక్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది. ఈ చిత్రాన్ని తొలుత అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో '70 ఎంటర్ టైన్ మెంట్స్ 'చేరినట్టుగా సమాచారం.

సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోను తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. గత చిత్రం 'మజాకా' పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.