English | Telugu

ఆయన పవర్ ఫుల్ వ్యక్తి .. విజయ్ దేవరకొండ హిట్ కొట్టడం ఖాయమా! 

'విజయ్ దేవరకొండ'(Vijay Devarakonda)ఈ నెల 31 న 'కింగ్ డమ్'(Kingdom)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.ట్రైలర్ తో మంచి అంచనాలని క్రియేట్ చేసిన 'కింగ్ డమ్' విజయ్ ని వరుస పరాజయాల బాట నుంచి తప్పించి, ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ వ్యయంతో నిర్మించడం, 'జెర్సీ' మూవీ తర్వాత దర్శకుడు 'గౌతమ్ తిన్ననూరి'(Gowtham Tinnanuri)చాలా గ్యాప్ తీసుకొని 'కింగ్ డమ్' ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో కూడా' కింగ్ డమ్' పై మంచి అంచనాలు ఉన్నాయి.

'కింగ్ డమ్' టీం రీసెంట్ గా 'చెన్నై'(Chennai)లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 'విజయ్ దేవరకొండ' మాట్లాడుతు 'కింగ్ డమ్' తమిళ వెర్షన్ టీజర్ వాయిస్ కోసం ఒక పవర్ ఫుల్ వాయిస్ తో ఇప్పించాలని అనుకున్నాం. అప్పుడు వెంటనే సూర్య(Suriya)అన్నే నా మైండ్ లోకి వచ్చాడు. దీంతో అన్నని అడిగిన వెంటనే ఓకే చెప్పాడు. ఆయన ఎంతో దయా హృదయం కలిగిన పవర్ ఫుల్ వ్యక్తి అంటు విజయ్ మాట్లాడటం జరిగింది.

విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri borse)జత కట్టగా కౌశిక్ మెహతా, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం' కింగ్ డమ్' టికెట్ రేట్స్ ని నిర్దిష్ట రేట్స్ కి పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.